మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇటీవలే రూ. 16,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను పూర్తిచేసింది. ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు రూ. 13,000 కోట్లు, 3.4 బిలియన్ డాలర్ల చొప్పున బైబ్యాక్ లేదా డివిడెండ్ల రూపంలో చెల్లించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డు కూడా రూ. 3,500 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. విప్రో కూడా ఇదే బాటలో ఉంది.