సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కనీస వేతన పెంపు కల సాకారం కానుందా. దాదాపు 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా? తాజా నివేదికల ప్రకారం త్వరలోనే కనీస వేతనంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 7 వ వేతన కమిషన్ సిఫార్సులను ప్రకటించిన పద్దెనిమిది నెలల తర్వాత, మోదీ సర్కార్ కనీస వేతన పెంపును ఒక రియాలిటీగా మార్చేందుకు కృషి చేస్తోంది. కనీస వేతన పెంపును గ్రేడ్1 నుంచి గ్రేడ్ 5వరకు కింది స్థాయి ఉద్యోగులకు ఉపయోగడేలా నిర్ణయం తీసుకోనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థిక శాఖకార్యాలయ సీనియర్ అధికారి తెలిపారు. 6వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫార్ములా 3.00 టెమ్స్ పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని ప్రకారం ఎంట్రీ లెవల్లో కనీస వేతనం ఏడువేలనుంచి రూ.18వేలకు పెరగనుంది. క్లాస్1 అధికారుల ప్రారంభ వేతనం రూ.56వేలుగా ఉంటుంది. సెక్రటరీ లాంటి అత్యున్నత స్థాయి అధికారుల ప్రారంభ వేతనం రూ. 90 వేలనుంచి రూ. 2.5 లక్షలకు పెరుగుతుంది.
కాగా కనీస వేతనంలో(ఫిట్‌మెంట్ ఫార్ములా 3.68 రెట్లు) 26 వేల రూపాయల పెంపును ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment