Minimum wage hike
-
Minimum Wages: జీతాలు పెరగబోతున్నాయా ?
న్యూఢిల్లీ: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా తగ్గిన ఆదాయంతో సతమతం అవుతున్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ సర్కారు ముందుకు వచ్చింది. కనీస వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అందరికీ కరువు భత్యం పెంచుతున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు. 2021 ఏప్రిల్ 21 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా కార్మిక లోకంలో సంతోషం వెల్లివిరుస్తోంది. కేంద్రం సైతం మరోవైపు కనీస వేతనాలపై కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు ఇటీవల ఆర్థిక వేత్త అజిత్ మిశ్రా నేతృత్వంలో కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు. అయితే కనీస వేతనాలపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. కేవలం కాలయాపన చేసేందుకే అజిత్ మిశ్రా కమిటీ వేశారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించింది. కమిటీ పేరుతో కాలయాపన చేయబోమని కనీస వేతనాలపై త్వరగానే నిర్ణయం తీసుకుంటామంటూ కేంద్ర కార్మిక శాఖ నుంచి ప్రకటన వచ్చింది. జూన్ 29న కనీస వేతనాలకు సంబంధించి జూన 14న అజిత్ మిశ్రా కమిటీ ఓసారి సమావేశమైంది. జూన్ 29న రెండో సారి సమావేశం కావాల్సి ఉంది. కోవిడ్ ఇబ్బందుల నేపథ్యంలో మిశ్రా కమిటీ నుంచి త్వరగానే నివేదిక తెప్పించుకుని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. -
వారికి గంటకు వేయి రూపాయల వేతనం..
న్యూయార్క్ : ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ అమెరికాలో ఉద్యోగుల కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో వచ్చే నెల నుంచి అమెజాన్ ఉద్యోగులకు రోజుకు (ఎనిమిది గంటల పనికి) దాదాపు ఎనిమిది వేల రూపాయలు కనీస వేతనంగా అందనుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కంపెనీలో పని పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో అమెజాన్ కనీస వేతన పెంపును ప్రకటించింది. కనీస వేతనాన్ని పెంచే దిశగా అమెరికన్ ప్రభుత్వంపై లాబీయింగ్ చేయడంతో పాటు తమ ప్రత్యర్ధులను సైతం ఈ దిశగా ముందడుగు వేయాలని కోరతామని ఆన్లైన్ రిటైలర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన కనీస వేతనం అందేలా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేసింది. నూతన కనీస వేతనంతో 2.5 లక్షల మంది అమెజాన్ ఉద్యోగులతో పాటు హాలిడే సేల్స్ కోసం తాత్కాలికంగా రిక్రూట్ చేసుకున్న లక్షకు పైగా సీజనల్ ఉద్యోగులకు లబ్ధి కలగనుందని కంపెనీ తెలిపింది. కనీస వేతన పెంపు దిశగా తొలి అడుగు వేయాలనే చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ వ్యవస్ధాపక సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు. -
కింది స్థాయి ఉద్యోగులకు గుడ్ న్యూస్?
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కనీస వేతన పెంపు కల సాకారం కానుందా. దాదాపు 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా? తాజా నివేదికల ప్రకారం త్వరలోనే కనీస వేతనంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 7 వ వేతన కమిషన్ సిఫార్సులను ప్రకటించిన పద్దెనిమిది నెలల తర్వాత, మోదీ సర్కార్ కనీస వేతన పెంపును ఒక రియాలిటీగా మార్చేందుకు కృషి చేస్తోంది. కనీస వేతన పెంపును గ్రేడ్1 నుంచి గ్రేడ్ 5వరకు కింది స్థాయి ఉద్యోగులకు ఉపయోగడేలా నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థిక శాఖకార్యాలయ సీనియర్ అధికారి తెలిపారు. 6వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫార్ములా 3.00 టెమ్స్ పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని ప్రకారం ఎంట్రీ లెవల్లో కనీస వేతనం ఏడువేలనుంచి రూ.18వేలకు పెరగనుంది. క్లాస్1 అధికారుల ప్రారంభ వేతనం రూ.56వేలుగా ఉంటుంది. సెక్రటరీ లాంటి అత్యున్నత స్థాయి అధికారుల ప్రారంభ వేతనం రూ. 90 వేలనుంచి రూ. 2.5 లక్షలకు పెరుగుతుంది. కాగా కనీస వేతనంలో(ఫిట్మెంట్ ఫార్ములా 3.68 రెట్లు) 26 వేల రూపాయల పెంపును ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కనీస వేతనం పెంచాలి
ఆళ్లగడ్డ: గ్రామ పంచాయతీ వర్కర్లు, ఉద్యోగుల కనీస వేతనం రూ.12వేలకు పెంచాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్క్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. రాష్టంలోని పెద్ద, చిన్న గ్రామ పంచాయతీలన్నింటిలో స్వీపర్లు, వాటర్మెన్లు, ఎలక్ట్రీషియన్లు, అటెండర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్మెన్లుగా సుమారు 40 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. వారంతా చాలీచాలని వేతనాలతో దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన చెందారు. పంచాయతీలకు ఆదాయాలు లేవంటూ తమకు వేతనాలు పెంచడం లేదని వాపోయారు. రాజకీయ జోక్యం పెరగడంతో కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వైఎస్ జగన్ను కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మెబాట
నేటి నుంచి విధులకు గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: ‘కనీస’ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు ప్రకటించాయి. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది. సమ్మె సైరన్ మోగింది: కార్మిక సంఘాల జేఏసీ తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కరువవ్వడంతో తాము సమ్మెలోకి వెళ్తున్నామని, ఇందుకు సైరన్ మోగిందని.. దీన్ని ఆపడం ముఖ్యమత్రి కేసీఆర్ తరం కాదని కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జీహెచ్ఎంసీలో పనిచేసే వివిధ విభాగాల కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యాదాద్రికి రెండు వందల కోట్లు, వేములవాడకు ఏడాదికి రూ.వంద కోట్లను ప్రకటిస్తున్న సీఎంకు తమ గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్యూనియన్ల నేతలు ప్రసంగించారు. ఫలించని గత చర్చలు.. మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20న కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చర్చలు జరిపారు. ఈ మేరకు కార్మికుల డిమాండు మేరకు పెంపు ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎంవో పరిశీలనలో ఉండడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో సమ్మె గత నెల 22 నుంచి జూలై 6కు వాయిదా పడింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనలకు కదలిక లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అందరితో పాటే పెంచుతాం ఆర్థిక శాఖ స్పష్టీకరణ మునిసిపల్ కార్మికుల వేతన పెంపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, అందరితో పాటే మునిసిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని స్పష్టీకరించింది. దీంతో వేతన పెంపు ప్రతిపాదనలను సీఎం కార్యాలయం పరిశీలనకు పంపినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.