ఆళ్లగడ్డ: గ్రామ పంచాయతీ వర్కర్లు, ఉద్యోగుల కనీస వేతనం రూ.12వేలకు పెంచాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్క్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. రాష్టంలోని పెద్ద, చిన్న గ్రామ పంచాయతీలన్నింటిలో స్వీపర్లు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు, అటెండర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్‌మెన్లుగా సుమారు 40 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. వారంతా చాలీచాలని వేతనాలతో దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన చెందారు. పంచాయతీలకు ఆదాయాలు లేవంటూ తమకు వేతనాలు పెంచడం లేదని వాపోయారు. రాజకీయ జోక్యం పెరగడంతో కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వైఎస్ జగన్‌ను కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment