గిగావాట్ మైలురాయి చేరిన మిత్రా ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ రంగ సంస్థ మిత్రా ఎనర్జీ తాజాగా పవన విద్యుదుత్పత్తికి సంబంధించి 1 గిగావాట్ మైలు రాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్పరిలో 220 మెగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటుతో తమ పవన విద్యుత్ స్థాపిత సామర్ధ్యం మొత్తం 1,000 మెగావాట్లకు (1 గిగావాట్) చేరిందని కంపెనీ తెలిపింది. ఆరేళ్ల వ్యవధిలోనే ఇది సాధించగలిగామని సంస్థ చైర్మన్ రవి కైలాస్ పేర్కొన్నారు.