న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన విత్తన సంస్థ మోన్ శాంటో అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రపంచంలో అతిపెద్ద విత్తన కంపెనీ, దేశంలో 90 శాతం మార్కెట్ ను ఆక్రమించిన మోన్ శాంటో విత్తన అమ్మకాలపై నిబంధలను మోదీ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో జీఎం (జెనిటికల్లీ మోడిఫైడ్)పత్తి విత్తనాల అమ్మకాలపై ఒత్తడి పెంచింది. కంపెనీ విత్తన విక్రయాలపై రాయల్టీ విధించనున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.
జీఎం కాటన్ విత్తనాలను 450 గ్రా.ల ప్యాకెట్ ను800 రూ.లుగా విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆదేశాల ప్రకారం మోన్ శాంటో ఏదైనా కొత్త, అడ్వాన్స్డ్ విత్తనాన్ని మార్కట్లోకి తీసుకురావాలంటే నిర్ణయించిన ధరకు మాత్రమే విక్రయించాలి. దీంతోపాటుగా విత్తన ధరలో10 శాతం కంటే ఎక్కువ రాయిల్టీ వసూలు చేసే అవకాశం లేదు. అలాగే బీటీ రకం పత్తి విత్తనాలను అమ్మదలచే స్థానిక కంపెనీలు 30 రోజుల్లోగా లైసెన్స్ పొందాలని స్పష్టం చేసింది.
అయితే ఈ ఆదేశాలను పరిశీలిస్తున్నామని మోన్ శాంటో తెలిపింది. అగ్రికల్చరల్ బయో ఆవిష్కరణలకు ఇది భారీ దెబ్బఅని బయోటెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆరోపించింది. పరిశోధన పెట్టుబడి సంస్థలను నిరుత్సాహపరిచేదిగా ఉందని వాదించింది.
మోన్‌శాంటో-మహికో బయోటెక్ (ఎంఎంబి) లిమిటెట్ మనదేశ చట్టాలకు విరుద్ధంగా బీటీ పత్తిపై రాయల్టీలను వసూలు చేస్తోందనే అరోపణలు ఉన్నాయి. దీంతో గత మార్చి నెలలో రైతులు రాయల్టీ చెల్లింపులపై భారీ కోత విధించింది. ముఖ్యంగా ''టెక్నాలజీ ఫీజు'', ''ట్రైట్ ఫీజు''ల పేరుతో దేశంలోని చిన్నకారు రైతుల నుంచి భారీ వసూళ్లను రాబడుతోందనీ, ఇంతపెద్ద మొత్తాలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారనే విమర్శలు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.
కాగా ఇండియాలో మోన్ శాంటో భాగస్వామ్య సంస్థ మహికో ఎక్కువ ధరలను వసూలు చేస్తోందని దేశీయ రైతులనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోన్‌శాంటోపై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక విత్తన ఉత్పత్తిదారులు కూడా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మోన్‌శాంటో విధించే రాయల్టీ చార్జీలు భరించలేని స్థాయి లో ఉన్నాయన్న ఆరోపణలపైనే ఈ కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.
మోన్ శాంటోకు భారీ ఝలక్
Published Sat, May 21 2016 3:27 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Advertisement