puts
-
ట్విన్ టవర్స్ కూల్చివేత ఉగ్రదాడి కాదట!
సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి తప్పులో కాలేసింది. తన ట్రెండింగ్ టాపిక్స్ లో బూటక కథనాన్ని ప్రకటించడం సంచనలం రేపింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం ఉగ్రదాడి కాదంటూ డైలీ స్టార్ లింక్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన టెక్ మీడియా అది తప్పుడు కథనమని తెలిపింది. తక్షణ పరిష్కారంగా ఈ కథనాన్ని తొలగించినట్టుగా ఫేస్ బుక్ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారని టెక్ వెబ్ సైట్ సీఎన్ఈటీ ప్రకటించింది. 9/11 ఉగ్రదాడికి 15 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా సాధారణంగా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పై ప్రజలకు ఆసక్తి ఉంటుందని మీడియా నివేదించింది. ఈ కారణంగానే ఇది టాప్ లిస్ట్ లో నిలిచిందని తెలిపింది. అయితే గత రెండు వారాల్లో ఇలాంటి తప్పుడు కథనాలు దర్శనమివ్వడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ట్విన్ టవర్స్ ఉగ్రదాడి ఘటన టెర్రరిస్టుల పనికాదనీ, భవనంలో అమర్చిన బాంబుల వల్లే టవర్స్ కూలిపోయాయంటూ ఫేస్ బుక్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఓ కథనం టాప్ లో నిలిచింది. దీంతో వివాదం చెలరేగింది. అయితే అల్గారిథమ్స్ తప్పుడు లింక్ లను సంస్థ క్వాలిటీ కంట్రోల్ టీం కనిపెట్టకపోవడంపై వ్యాఖ్యానించడానికి ఫేస్ బుక్ నిరాకరించింది. కాగా ఫేస్ బుక్ ప్రస్తుతం సుమారు 1.7 బిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ట్రెండింగ్స్ టాపిక్స్ లోని కథనాలు వాస్తవమా కాదా అనే దానికి సంబంధం లేకుండా పాపులర్ మారి, ఎక్కువ వ్యూస్ ను సాధించడం తెలిసిందే. -
కెమెరా, ఆడియోజాక్ లపై టేప్ అంటించిన జుకర్ బర్గ్..
లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన మ్యాక్ బుక్ పై కెమెరా, ఆడియో జాక్ లను టేప్ తో కవర్ చేయడం కనిపించింది. తన సామాజిక ఖాతాల పాస్వర్డ్ లు హ్యాక్ అయిన తర్వాత ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియో జాక్ లపై టేప్ అటించినట్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా సైట్లతోపాటు, నెట్ బ్యాంకింగ్ ఖాతాలు ఇటీవల హ్యాకర్ల చేతుల్లోకి వెడుతున్నాయని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి బాధితుల జాబితాలో సామాన్యులే కాక, ఏకంగా ప్రపంచ దిగ్గజాలు కూడ ఉంటున్నారు. అదే విషయంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ కూడ నిర్లక్ష్యం వహించి తన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలకు ఒకేరకమైన పాస్వర్డ్ పెట్టడంతో ఆయన ఖాతాలుసైతం హ్యాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ నెలవారీ వినియోగదారులు 500 మిలియన్లు దాటిన సంతోషకర సందర్భంలో జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ చిత్రంలో జుకర్ బర్గ్ చేతిలో ఓ చెక్క ఫ్రేమ్ పట్టుకొని ఉండగా, ఆయన వెనుక ఆయన ల్యాప్ ట్యాప్ కనిపిస్తుంది. ఆ సన్నివేశం చూస్తే ఆయనేదో సందేశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆ ఫోటోను పరీక్షగా చూసిన ట్విట్టర్ వినియోగదారుడు క్రిస్ ఓల్సెన్.. జుకర్ బర్గ్ ల్యాప్ టాప్ కెమెరాను, టేప్ ప్ తో కవర్ చేశారంటూ కామెంట్ చేశాడు. అధునాతన హ్యాకర్లు కెమెరాద్వారా ల్యాప్ టాప్ ను నియంత్రిస్తారు. అందుకే జుకర్ బర్గ్ ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియోజాక్ లను టేప్ తో చుట్టేశారంటూ మరో వినియోగదారుడు గిజ్మోడో తన కామెంట్లో జుకర్ బర్గ్ పై ఛలోక్తి విసిరాడు. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలు, ప్రైవసీని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ఫేస్ బుక్ సీఈవో.. ఇలా తన ప్రైవసీని కాపాడుకోవడానికి పడుతున్నతాపత్రయం అందరికీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జుకర్ బర్గ్ తన వెబ్ క్యామ్ కు కూడ టేప్ వేసి ఉంచినట్లు తాను ఇదివరకే ఓ సందర్శంలో గమనించాని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చెప్తుండగా...కొన్నేళ్ళ క్రితంనుంచే ఆమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా తమ పౌరులను వెబ్ క్యామ్ ల ద్వారా పరిశీలిస్తోందని క్వాంటికోలోని ఎఫ్ బీ ఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ లో మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మార్కస్ థామస్ చెప్తున్నారు. సో... తనదాకా వస్తే కానీ అన్న సామెత ఇక్కడ జుకర్ బర్గ్ కు కూడ వర్తింస్తోందన్న మాట. -
మోన్ శాంటోకు భారీ ఝలక్
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన విత్తన సంస్థ మోన్ శాంటో అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రపంచంలో అతిపెద్ద విత్తన కంపెనీ, దేశంలో 90 శాతం మార్కెట్ ను ఆక్రమించిన మోన్ శాంటో విత్తన అమ్మకాలపై నిబంధలను మోదీ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో జీఎం (జెనిటికల్లీ మోడిఫైడ్)పత్తి విత్తనాల అమ్మకాలపై ఒత్తడి పెంచింది. కంపెనీ విత్తన విక్రయాలపై రాయల్టీ విధించనున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. జీఎం కాటన్ విత్తనాలను 450 గ్రా.ల ప్యాకెట్ ను800 రూ.లుగా విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆదేశాల ప్రకారం మోన్ శాంటో ఏదైనా కొత్త, అడ్వాన్స్డ్ విత్తనాన్ని మార్కట్లోకి తీసుకురావాలంటే నిర్ణయించిన ధరకు మాత్రమే విక్రయించాలి. దీంతోపాటుగా విత్తన ధరలో10 శాతం కంటే ఎక్కువ రాయిల్టీ వసూలు చేసే అవకాశం లేదు. అలాగే బీటీ రకం పత్తి విత్తనాలను అమ్మదలచే స్థానిక కంపెనీలు 30 రోజుల్లోగా లైసెన్స్ పొందాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పరిశీలిస్తున్నామని మోన్ శాంటో తెలిపింది. అగ్రికల్చరల్ బయో ఆవిష్కరణలకు ఇది భారీ దెబ్బఅని బయోటెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆరోపించింది. పరిశోధన పెట్టుబడి సంస్థలను నిరుత్సాహపరిచేదిగా ఉందని వాదించింది. మోన్శాంటో-మహికో బయోటెక్ (ఎంఎంబి) లిమిటెట్ మనదేశ చట్టాలకు విరుద్ధంగా బీటీ పత్తిపై రాయల్టీలను వసూలు చేస్తోందనే అరోపణలు ఉన్నాయి. దీంతో గత మార్చి నెలలో రైతులు రాయల్టీ చెల్లింపులపై భారీ కోత విధించింది. ముఖ్యంగా ''టెక్నాలజీ ఫీజు'', ''ట్రైట్ ఫీజు''ల పేరుతో దేశంలోని చిన్నకారు రైతుల నుంచి భారీ వసూళ్లను రాబడుతోందనీ, ఇంతపెద్ద మొత్తాలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారనే విమర్శలు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. కాగా ఇండియాలో మోన్ శాంటో భాగస్వామ్య సంస్థ మహికో ఎక్కువ ధరలను వసూలు చేస్తోందని దేశీయ రైతులనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోన్శాంటోపై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక విత్తన ఉత్పత్తిదారులు కూడా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మోన్శాంటో విధించే రాయల్టీ చార్జీలు భరించలేని స్థాయి లో ఉన్నాయన్న ఆరోపణలపైనే ఈ కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.