మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్ | Murugappa gross profit up 26 percent | Sakshi
Sakshi News home page

మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్

Published Sat, Jun 13 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్

మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్

హైదరాబాద్: మురుగప్ప గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,780 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరపు స్థూల లాభంతో పోల్చితే ఇది 26 శాతం అధికమని మురుగప్ప గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.24,350 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో రూ.26,926 కోట్లకు చేరిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో తమ పనితీరు మెరుగుపడిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించామని తెలిపింది. కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా, కార్బొరండమ్ యూనివర్శల్, చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ... ఇవన్నీ మురుగప్ప గ్రూప్ కంపెనీలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement