
మిస్సైల్ ఎఫెక్ట్: మార్కెట్లు ఢమాల్
ముంబై:అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక వాతావరణం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. ఆరంభంనుంచి బలహీనంగా మార్కెట్లలో ఎక్కడా కోలుకున్న ధోరణి కనిపించలేదు. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 363 పతనమై, 31387వద్ద నిఫ్టీ ,121 పాయింట్లు క్షీణించి 9782 వద్ద చేరింది. దీంతో ప్రధాన సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి.
ముఖ్యంగా జపాన్ మీదుగా ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగంతో యూరప్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. దీంతో ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లు ఢమాల్ అన్నాయి. దాదాపు అన్ని రంగాలూ నీరసించగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఎన్‌టీపీసీ టాప్ లూజర్‌గా ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా పవర్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్, అదానీ పోర్ట్స్, ఇన్‌ఫ్రాటెల్, ఐబీహౌసింగ్, సన్ ఫార్మా 3-1.5 శాతం కుప్పకూలగా బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే స్వల్ప లాభాలతో ఉన్నాయి.