2017–18 క్యూ1లో ఆదాయం రూ.186.56 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ (ఎన్‌ఏసీఎల్) లాభాలపై ప్రభావం చూపించింది. 2017–18 తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎన్‌ఏసీఎల్ మొత్తం ఆదాయం రూ.186.56 కోట్లు. ఇందులో పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ.1.97 కోట్లు. ఇదే పీఏటీ గత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2.29 కోట్లను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దేశమంతటా వర్షాలు, వాతావరణ పరిస్థితులు బాగానే కలిసొస్తున్నా.. జీఎస్‌టీ కారణంగా క్యూ1లో అమ్మకాలపై ప్రభావం చూపించిందని సోమవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రైతులకు అవసరమైన ఉత్పత్తులను తీసుకురావడంలో భాగంగా ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో రెండు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎగుమతుల మార్కెట్ ఈసారి మెరుగ్గానే ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్యూ1లో శిలీంద్ర సంహారక మం దుల ఆర్డర్‌ను పొందినట్లు పేర్కొంది. నాగార్జు న అగ్రికెమ్ లిమిటెడ్ పేరు కాస్త ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మారినట్లు తెలిపింది.
నాగార్జున అగ్రికెమ్ లాభం డౌన్
Published Tue, Aug 8 2017 1:54 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
Advertisement
Advertisement