న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు అంచనాలను అప్లైడ్ ఎకనమిక్ రిసెర్చ్ నేషనల్ కౌన్సిల్(ఎన్‌సీఏఈఆర్) తగ్గిం చింది. వృద్ధి రేటును ఇంతక్రితం 5.7 శాతం అంచనావేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం సానుకూల అంశాలైనప్పటికీ- దేశంలో తక్కువ వర్షపాతం, పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఇతర అంతర్జాతీయ అనిశ్చితి అంశాలు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది.
విదేశాల్లో ఆర్థిక రికవరీ ధోరణి పటిష్టంగా లేదని, దేశీయంగా బ్యాంకుల్లో రుణ రేట్లు పెరగడం లేదని పేర్కొంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం వృద్ధిని, 2015-16లో 5.6 శాతం వృద్ధిని సాధించవచ్చని మూడీస్ ఇటీవలి నివేదిక పేర్కొంది. 2014-15లో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచబ్యాంక్ సైతం 5.6 శాతంగా అంచనావేసింది.
వృద్ధి అంచనాలకు కోత: ఎన్‌సీఏఈఆర్
Published Wed, Nov 5 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement