NCAER
-
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే సర్వే..!
న్యూఢిల్లీ: దేశంలో వినియోగదారుల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఐహెచ్‌డీఎస్ సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో భారత్‌లో వినియోగదారల డిమాండ్ క్షీణించిందని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వివరాల ఆధారంగా పలు సర్వేలు వెల్లడించినప్పటికీ.. తాజా సర్వే ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐహెచ్‌డీఎస్ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్), మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగదారుల డిమాండ్‌పై అధ్యయనం చేశారు. రాజస్థాన్‌లో 2,706 , బీహార్‌లో 1,643, ఉత్తరాఖండ్ 479 కుటుంబాల జీవన ప్రమాణాలను అధ్యయనం చేశామని ఐహెచ్‌డీఎస్ సర్వే తెలిపింది. ఎన్ఎస్ఎస్ సర్వేకు భిన్నంగా 2011-17 మధ్య కాలంలో ప్రజల వినియోగం పెరిగిందని సర్వే అభిప్రాయపడింది. మరోవైపు తలసరి ఆదాయంలో వృద్ధి 2004-05, 2011-12 మధ్యకాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2011-17 మధ్య కాలంలో తలసరి ఆదాయం, తలసరి వినియోగం వరుసగా 3.5, 2.7 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2004-05, 2011-12 సంవత్సరాలలో కుటుంబాలకు చెందిన తలసరి ఆదాయ వృద్ధి 7.2 శాతంగా ఉండగా, తలసరి వినియోగ వృద్ధి 4 శాతంగా నమోదైనట్టు సర్వే తెలిపింది. 2004-05, 2011-12 మధ్య కాలంలో వాహనాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరిగాయని, కార్లు, మోటారు వాహనాల కొనుగోళ్లు 22 శాతానికి పెరిగాయని, 2017 నాటికి మరో పది పాయింట్లు పెరిగినట్లు సర్వే ప్రకటించింది. ఆర్థిక విధానాల రూపకల్పనలో వినియోగ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్ఎస్ఎస్ పేర్కొన్న విషయం తెలిసిందే. స్పష్టమైన డాటా లేకపోవడం వల్లే ఆర్ధిక విధానాలను రూపకల్పన చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
పడిపోయిన ఏపీ ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్టుబడుల ఆకర్షణ జాతీయ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ మరింత దిగజారింది. గత ఏడాది కంటే నాలుగు స్థానాల దిగువకు పడిపోయి 7వ ర్యాంక్‌కు చేరింది. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరసగా 7, 8 స్థానాల్లో నిలిచాయని మంత్రి చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీ నాలుగు ర్యాంకుల కిందకు పడిపోయిందని రాధాకృష్ణన్ వివరించారు. 2016లో 4వ ర్యాంక్, 2017లో 3వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్.. 2018 నాటికి నాలుగు స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సుశిక్షితులైన శ్రామిక శక్తి, మౌలిక వసతుల లేమి, వ్యాపార, వాణిజ్యాలలో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణమే ఏపీ ర్యాంక్ పడిపోవడానికి కారణమని మంత్రి వివరించారు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీ టాప్
న్యూఢిల్లీ: అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 17లలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా జాబితా రూపొందించింది. -
నల్లధన నివేదికలను వెల్లడించలేం
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లోని భారతీయుల నల్లధనం ఎంత అన్నదానిపై తాము వేసిన అంచనా నివేదికలను బహిర్గతం చేయడం కుదరదని దేశంలోని రెండు ప్రముఖ సంస్థలు తెలిపాయి. సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్‌కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్(ఎన్ఐపీఎఫ్పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎననామిక్ రీసెర్చ్(ఎన్సీఏఈఆర్)లు ఈమేరకు బదులిచ్చాయి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా వీటిని అందించలేమన్నాయి. కాగా, భారతీయుల నల్లధనం 500 బిలియన్ డాలర్ల నుంచి 1,400 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పలు సంస్థలు అంచనా వేశాయి. -
అవినీతిలో ఏపీ నంబర్‌వన్
► చంద్రబాబు హయాంలో దక్కిన కిరీటం ► ఎన్సీఏఈఆర్ సంస్థ సర్వేలో నిర్ధారణ ► ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్రంగా ఉందని 74.3 శాతం మంది వెల్లడి ► తర్వాత స్థానంలో తమిళనాడు ► అవినీతి రహిత రాష్ర్టం హిమాచల్ ► ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు గ్రేడ్లు సాక్షి ప్రత్యేక ప్రతినిధి అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ (ఎన్సీఏఈఆర్) సంస్థ నిర్ధారించింది. దేశంలోకెల్లా ‘ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి రాష్ర్టం’ అని ఈ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎన్సీఏఈఆర్ సంస్థ అధ్యయనంలో కూడా అవినీతి రుజువుకావడంతో చంద్రబాబు ప్రభుత్వం లక్షన్నరకోట్లకు పైగా అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను నిర్ధారించినట్లయింది. ఎన్సీఏఈఆర్ సంస్థ ఐదు అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు గ్రేడ్లు ఇచ్చింది. ఆయా రాష్ట్రాలలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులపై ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం చేసింది. కార్మికులు, మౌలిక వసతులు, రాజకీయ సుస్థిరత, పరిపాలన, ఆర్థిక పరిస్థితి, వ్యాపార వాతావరణం మొదలైన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. దేశంలోని 29 రాష్ట్రాలోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఆంధ్రాలో అవినీతి తీవ్ర సమస్యే... ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అవినీతి రాష్ర్టంగా ఎన్సీఏఈఆర్ జరిపిన సర్వేలో తేలింది. తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్ర సమస్యగా ఉందని 74.3శాతం మంది చెప్పారు. 17.1 శాతం మంది అవినీతి ఓ మోస్తరుగా ఉందని చెప్పగా 8.6శాతం మంది అవినీతి సమస్య లేదని చెప్పారు. తమిళనాడులో 71.8శాతం మంది అవినీతి తీవ్ర సమస్యగా ఉందని వెల్లడించారు. 28.2శాతం మంది ఒక మోస్తరుగా ఉందని చెప్పగా అవినీతి సమస్య లేదని ఎవరూ చెప్పలేదు. అవినీతి తీవ్ర సమస్యగా ఉందని ఒక్కరూ చెప్పని రాష్ర్టంగా హిమాచల్ ప్రదేశ్‌గా తేలింది. అక్కడ 55శాతం మంది అవినీతి లేదని చెప్పగా ఓ మోస్తరుగా అవినీతి ఉందని 45శాతం మంది చెప్పారు. తెలంగాణలో 26.5 శాతం మంది అవినీతి తీవ్రంగా ఉందని చెప్పగా 61.8 శాతం మంది ఓ మోస్తరుగా ఉందని, 11.8 శాతం మంది అసలు అవినీతి జరగడం లేదని చెప్పారు. అవినీతి విషయంలో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో ఉంది. 64.3శాతం మంది అవినీతి తీవ్రంగా ఉందని చెప్పగా 22.9శాతం మంది ఓ మోస్తరుగా ఉందని, 12.9శాతం మంది అసలు అవినీతి జరగడం లేదని పేర్కొన్నారు. ఎక్కడిదీ ఎన్సీఏఈఆర్ ? భారతదేశంలో ఆర్ధిక విధానాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. 1956లో ప్రారంభమైన ఈ సంస్థ ఈ ఏడాది 60దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ వివిధ రంగాలపై అధ్యయనాలు జరపడం, సెమినార్లు నిర్వహించడం, నివేదికలు రూపొందించడం ఈ సంస్థ విధుల్లో భాగాలు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలలోని 49 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఎన్సీఏఈఆర్తో కలసి పనిచేస్తున్నాయి. రెండేళ్లలో లక్షన్నరకోట్ల మేర అవినీతి.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టిన రెండేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ బైటపెట్టింది. రాష్ర్టంలో జరిగిన అవినీతిపై అనేక కథనాలను రంగాలవారీగా ప్రచురించింది. అధికార రహస్యాలను బైటపెట్టబోనన్న ప్రమాణాన్ని గాలికొదిలి రాజధాని విషయంలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బినామీలతో కలసి దాదాపు లక్ష కోట్ల మేర దోచుకున్నారు. ఇసుక దందాల నుంచి సోలార్ ప్లాంట్ల వరకు, సాగునీటి శాఖ నుంచి విద్యుత్ టెండర్ల వరకు ప్రతి ప్రక్రియ లోనూ ముడుపులు అందేలా పెదబాబు, చినబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని రంగాలలోనూ అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అవినీతితో జరగని పని లేదనే స్థితికి తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ రంగంలో ఎంత మేర అవినీతి జరిగిందనేది వివరిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సాక్ష్యాలతో సహా ఏకంగా ఓ పుస్తకంగా ప్రచురించింది. ఆంగ్లంలో ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’, తెలుగులో ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో ఉన్న ఈ పుస్తక ప్రతులను పలువురు కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, శాసనసభ్యులకు, వివిధ దర్యాప్తు సంస్థలకు అందజేసింది. చంద్రబాబు అవినీతిపై న్యాయస్థానాల తలుపులూ తట్టాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులంటున్నారు. ఎన్‌సిఎఇఆర్ సర్వే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని నిర్ధారించడంతో ఇపుడు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మరింత విశ్వసనీయత చేకూరినట్లయింది. -
ఏడాదికి రూ. 4,400 లంచం ఇస్తున్నారు!
న్యూఢిల్లీ: పట్టణాలలో నివసించే కుటంబాలు ఏడాదికి సగటున రూ. 4,400 లంచం రూపంలో చెల్లిస్తున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అదే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక కుటుంబం సగటున ఏడాదికి రూ. 2,900 లంచం ఇస్తున్నట్లు సర్వేలో తెలిసింది. జాతీయ ఆర్థిక పరిశోధనా మండలి (ఎన్సీఏఈఆర్) లక్నో, పాట్నా, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పూణె తదితర ప్రాంతాలలో సర్వే నిర్వహించింది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన ఆ సంస్థ విషయాలు వెల్లడించింది. నగరాలలో అయితే ఉద్యోగం, బదిలీలు వంటి అంశాలలో సుమారు రూ. 18 వేలు, ట్రాఫిక్ పోలీసులకు ఏడాదికి సుమారు రూ. 600 తాయిలాల రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులకు చెల్లింపులు జరుగుతున్నాయని 2012 సంత్సరంలో సెప్టెంబర్ - డిసెంబర్ నెలల మధ్య నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. -
వృద్ధి అంచనాలకు కోత: ఎన్సీఏఈఆర్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు అంచనాలను అప్లైడ్ ఎకనమిక్ రిసెర్చ్ నేషనల్ కౌన్సిల్(ఎన్సీఏఈఆర్) తగ్గిం చింది. వృద్ధి రేటును ఇంతక్రితం 5.7 శాతం అంచనావేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం సానుకూల అంశాలైనప్పటికీ- దేశంలో తక్కువ వర్షపాతం, పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఇతర అంతర్జాతీయ అనిశ్చితి అంశాలు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. విదేశాల్లో ఆర్థిక రికవరీ ధోరణి పటిష్టంగా లేదని, దేశీయంగా బ్యాంకుల్లో రుణ రేట్లు పెరగడం లేదని పేర్కొంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం వృద్ధిని, 2015-16లో 5.6 శాతం వృద్ధిని సాధించవచ్చని మూడీస్ ఇటీవలి నివేదిక పేర్కొంది. 2014-15లో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచబ్యాంక్ సైతం 5.6 శాతంగా అంచనావేసింది.