ఏడాదికి రూ. 4,400 లంచం ఇస్తున్నారు!
న్యూఢిల్లీ: పట్టణాలలో నివసించే కుటంబాలు ఏడాదికి సగటున రూ. 4,400 లంచం రూపంలో చెల్లిస్తున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అదే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక కుటుంబం సగటున ఏడాదికి రూ. 2,900 లంచం ఇస్తున్నట్లు సర్వేలో తెలిసింది. జాతీయ ఆర్థిక పరిశోధనా మండలి (ఎన్సీఏఈఆర్) లక్నో, పాట్నా, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పూణె తదితర ప్రాంతాలలో సర్వే నిర్వహించింది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన ఆ సంస్థ విషయాలు వెల్లడించింది.
నగరాలలో అయితే ఉద్యోగం, బదిలీలు వంటి అంశాలలో సుమారు రూ. 18 వేలు, ట్రాఫిక్ పోలీసులకు ఏడాదికి సుమారు రూ. 600 తాయిలాల రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులకు చెల్లింపులు జరుగుతున్నాయని 2012 సంత్సరంలో సెప్టెంబర్ - డిసెంబర్ నెలల మధ్య నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే.