భారతీయుల నల్లధనంపై నివేదికలను బహిర్గతం చేయడం కుదరదని రెండు ప్రముఖ సంస్థలు తెలిపాయి.
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లోని భారతీయుల నల్లధనం ఎంత అన్నదానిపై తాము వేసిన అంచనా నివేదికలను బహిర్గతం చేయడం కుదరదని దేశంలోని రెండు ప్రముఖ సంస్థలు తెలిపాయి. సమాచార హక్కు కింద దాఖలైన పిటిషన్‌కు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్(ఎన్‌ఐపీఎఫ్‌పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎననామిక్ రీసెర్చ్(ఎన్‌సీఏఈఆర్)లు ఈమేరకు బదులిచ్చాయి.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా వీటిని అందించలేమన్నాయి. కాగా, భారతీయుల నల్లధనం 500 బిలియన్ డాలర్ల నుంచి 1,400 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని పలు సంస్థలు అంచనా వేశాయి.