
న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో దేశీయ ఆన్‌లైన్ షాపర్స్ డిస్కౌంట్లతో హోర్రెతిస్తుంటాయి. కస్టమర్ల నుంచి కలెక్షన్లు కూడా అదేమాదిరి వెల్లువెత్తుతుంటాయి. ఈ దివాళి సీజన్‌లో దాదాపు రూ.19వేల కోట్ల ఆన్‌లైన్ షాపింగ్ జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ డిస్కౌంట్లతో హోర్రెత్తిస్తున్న ప్రొడక్ట్స్‌లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? ఎప్పుడైనా గుర్తించారా? ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన విచారణలో భారీ మొత్తంలో నకిలీ తయారీదారులు, నకిలీ విక్రేతలు వెలుగులోకి వచ్చారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని లోపాలను వాడుకుంటూ... నకిలీ తయారీదారులు, నకిలీ విక్రేతలు ఆన్‌లైన్ అమ్మకాల్లో చెలరేగి పోతున్నారని తెలిసింది. ఆన్‌లైన్ రిటైలర్లు కూడా భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తెలిసింది.
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనని తేలింది. అంతేకాక అపీరల్స్ విషయానికి వస్తే.. 40 శాతం ఉత్పత్తులు నకిలీ తయారీదారులవే లిస్టు అయినట్టు విచారణలో వెల్లడైంది. స్థానిక పోలీసుల సాయంతో మీరుట్‌లోని బ్రహ్మంపురి ఏరియాలో జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ నకిలీ ఉత్పత్తులను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి వాటిలో విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. అసలు రూ.170-200 మధ్యలో ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450-500కు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఆ ఉత్పత్తులపై ఎంఆర్‌పీ రూ.900-1000గా పేర్కొంది. భారీగా 50-60 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటిస్తారని విచారణ అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో సెక్షన్ 79లోని లోపాన్ని వాడుకుంటూ కంపెనీలు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సైబర్ లా స్పెషలిస్ట్ పవన్ దుగల్ చెప్పారు. మనీలాండరింగ్‌కు, చీటింగ్‌కు కంపెనీలు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నట్టు తెలిపారు.
ఆన్‌లైన్‌లో భారీ మొత్తంలో ఫేక్ ప్రొడక్ట్స్