
బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం).. ప్రత్యేకించి నగర అవ సరాలకు తగిన విధంగా రూపొందించిన ‘బొలెరొ సిటీ పిక్–అప్’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్–అప్ వాహన ధర రూ.6.25 లక్షలు(ఎక్స్‌షోరూమ్– బెంగళూరు)గా నిర్ణయించింది. ఫోర్–సిలెండర్.. 2,523 సీసీ డిజిల్ ఇంజిన్ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది. నగరాల మధ్య అవసరాలు తీర్చడానికి బొలెరొ మ్యాక్సిట్రక్ ప్లస్ ఉండగా.. నూతన సిటీ పిక్–అప్ నగర అవసరాలకు సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment