సొంతిల్లు బృందావనం! | new business trendz in realty special designs for customers | Sakshi
Sakshi News home page

సొంతిల్లు బృందావనం!

Published Fri, Nov 18 2016 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

సొంతిల్లు బృందావనం! - Sakshi

సొంతిల్లు బృందావనం!

అందంతో పాటూ ఆరోగ్యాన్ని అందించే సొంతిల్లు
పడవ ఆకారంలో ఎలివేషన్..
ఎలివేషన్‌లో వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు
విభిన్న తరహా నిర్మాణాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్న సంస్థలు

గతంలో ఇల్లు అంటే నాలుగు గోడలుండే నిర్మాణం. కానీ, ఇప్పుడు ఇల్లంటే ఓ హుందా. ఓ హోదా. ఓ ఫ్యాషన్! ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు సొంతింటివాసులు. నిర్మాణ సంస్థలూ తక్కువేం కాదు.. సింగపూర్, మలేిసియా వంటి దేశాల్లో కనిపించే విభిన్న తరహా నిర్మాణాలను భాగ్యనగరంలో నిర్మించేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎలివేషన్‌‌స నుంచే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేస్తున్నారు. పడవ ఆకారంలో ఎలివేషన్, ఎలివేషన్‌లోనే వర్టికల్ గార్డెన్ ఏర్పాటు వంటివి ఈ జాబితాలోనివే మరి!!

సాక్షి, హైదరాబాద్: పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణాలుండాలి. మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్‌లను ప్రజలు ఆదరించట్లేదు. విదేశీ తరహాలో నిర్మాణం.. అన్ని రకాల వసతులు.. అదీ అందుబాటు ధరల్లో ఉండే ప్రాజెక్ట్‌లంటేనే కస్టమర్లు జై కొడుతున్నారు. దీంతో విదేశాల్లో కనిపించే విభిన్న నిర్మాణాలు ఇప్పుడు భాగ్యనగరంలోనూ కనిపిస్తున్నారుు. కస్టమర్లను ఆకర్షించడం కోసం విభిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో సంస్థల మధ్య పోటీ పెరిగి భాగ్యనగరం హంగులద్దుకుంటుంది కూడా.

ఎలివేషన్లలో వర్టికల్ గార్డెన్..
రిసార్ట్, విల్లాల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. అందుకే చుట్టూ పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్ చేస్తారు. కానీ, అపార్ట్‌మెంట్స్‌లో.. అది కూడా స్థలాల లభ్యత తక్కువగా ఉండే మహానగరాల్లో అంటే కాసింత కష్టమే. దీనికి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది నిలువైన ఉద్యానవనాలు (వర్టికల్ గార్డెన్‌‌స). భవనాల ఎలివేషన్లలో నిలువుగా మొక్కలు పెంచడం వర్టికల్ గార్డెన్‌‌స ప్రత్యేకత. అరుుతే ఇవి ఎలివేషన్, బయటి గోడల మీదనే సాధ్యమవుతాయని నవరత్న క్రాప్స్ సైన్‌‌స ప్రై.లి. యజమాని ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.

ఎండ పడని ప్రాంతంలో అంటే ఇంట్లో, హాల్‌లో, బెడ్ రూమ్‌లో వర్టికల్ గార్డెన్‌‌సను పెంచటం కుదరదు. ఇక్కడ పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ ్చని పేర్కొన్నారు. సూర్యరశ్మి పడే ప్రాంతమైతే వర్టికల్ గార్డెన్‌‌సలో కూరగాయలు, ఆకుకూరలు కూడా పెంచుకునే వీలు ఉందని వివరించారు. వర్టికల్ గార్డెన్‌‌స ఏర్పాటుపై ఆసక్తి ఉన్న వారికి సాంకేతికంగా ప్రోత్సాహమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణరుుంచినట్లు సమాచారం.

పిల్లలే లక్ష్యంగా..
ఇంటి కొనుగోళ్లలో పిల్లల అభిరుచులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే పిల్లల అభిరుచులకు అనుగుణంగా విదేశీ ఆర్కిటెక్చర్లతో ప్రాజెక్ట్‌లను డిజైన్ చేరుుస్తున్నారు బిల్డర్లు. ఇందుకోసం ప్రాజెక్ట్ ఎలివేషన్ దగ్గర నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతోనే పిల్లల్ని ఆకట్టుకుంటే.. ప్రాజెక్ట్‌లోనే పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ఏర్పాటుతో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు.

అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ఇందులోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రాజెక్ట్‌లో క్లబ్‌హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు కల్పించాలంటే ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటారుుస్తారు. అలాకాకుండా ఎలివేషన్‌కు కేటారుుంచే స్థలంలో ఈ వసతులను కల్పిస్తే.. స్థలం వినియోగం అవటంతో పాటు.. ఫ్లాట్ల విస్తీర్ణమూ పెరుగుతుంది కూడా.

వేటికవి ప్రత్యేకమైనవే..
ఇప్పటికే నగరంలో విభిన్న తరహా నిర్మాణాలున్నారుు. ఉదాహరణకు అవిఘ్ఞ ప్రాజెక్ట్‌లో పడవ ఆకారంలో ఎలివేషన్ నిర్మాణంతో ఆకట్టుకుంది గిరిధారి కన్‌స్రక్షన్‌‌స. 8 వేల చ.అ.ల్లో 125 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుండే ఈ ఎలివేషన్ పైన ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. ఎలివేషన్‌కు ఇరువైపులా రెస్టారెంట్, జిమ్, సూపర్‌మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, ప్లే స్కూల్, కాఫీ షాప్ వంటి వసతులను ఏర్పాటు చేస్తోంది. మహేశ్వరంలో రాంకీ సంస్థ నిర్మిస్తున్న డిస్కవరీ సిటీలో 15 ఎకరాలు విద్యా సంస్థలకు కేటారుుంచింది. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది కూడా. మూసాపేట్‌లోని సైబర్‌సిటీ రెరుున్‌బో విస్టాస్‌లో ఫేజ్-1లో నెక్ట్స్‌జెన్ ప్లే స్కూల్‌ను ఏర్పాటు చేసింది. ఫార్చ్యూన్ బటర్ ఫ్లై సంస్థ కడ్తాల్‌లో 3,600 ఎకరాల్లో నిర్మిస్తున్న ఫార్చ్యూన్  బటర్  ఫ్లై సిటీలో అపార్ట్‌మెంట్లు, విల్లాలతో పాటూ స్పోర్‌‌ట్స అకాడమీని నిర్మిస్తోంది.

మరి వాస్తు సంగతో?
అరుుతే విదేశీ తరహా నిర్మాణాలతోనే కస్టమర్లను ఆకట్టుకోవచ్చనుకోవటం పొరపాటు. ఎందుకంటే మన దేశంలో ఇంటి ఎంపికలో వాస్తు శాస్త్రం బలంగా పనిచేస్తుంది. అందుకే నిర్మాణంలో విభిన్నతే కాకుండా వాస్తును కూడా పక్కాగా పాటిస్తున్నామని ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ‘‘వృత్తం బుద్ధి వృద్ధియంత్.. అర్ధ వృత్తం యశోభవాత్’’అంటే వృత్తం (గుండ్రంగా) జ్ఞానాన్ని పెంచుతుంది. సగం వృత్తం కీర్తి, పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని దానర్థం. అందుకే మురారీ ప్రాజెక్ట్ ఆకారాన్ని అర్థ వృత్తాకారంలో, వృత్తాకారంలో క్లబ్ హౌజ్‌ను తీర్చిదిద్దుతున్నామని’’ఆయన వివరించారు.

నివాస సముదాయాలే కాదు పలు కార్పొరేట్, విద్యా సంస్థలు కూడా వృత్తం, అర్ధ వృత్తాకారంలో ఉంటారుు. ఉదాహరణకు ఆపిల్ కార్యాలయం వృత్తం ఆకారంలో ఉంటుంది. రాజ ప్రాసాదాలు, నలంద, తక్షశిల వర్సిటీలు అర్ధ వృత్తాకారంలో ఉంటారుు. సాధారణ భవనాలతో పోల్చితే వర్టికల్ గార్డెన్‌‌స భవనాల ధర చ.అ.కు రూ.100-200 అధికంగా ఖర్చవుతుంది. అరుునా సరే బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. కస్టమర్లకు ఏదో నాలుగు గోడలుండే ఇంటిని అందించాలని కాకుండా వారి ఇంటిని అందంగా.. ఆరోగ్యకరంగా బృందావనంగా తీర్చిదిద్దుతున్నారు.

అందం.. ఆరోగ్యం!
వర్టికల్ గార్డెన్‌‌సతో ఇంటి అందం ద్విగుణీకృతమవ్వటమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.

వర్టికల్ గార్డెన్‌‌స ఉన్న భవనాలు పర్యావరణహితంగా ఉంటారుు. అంటే శబ్ద, వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

భవనం గోడలు, పిల్లర్లను ఆధారం చేసుకొని బయోలాజికల్ ఎరువులతో పెంచటం వల్ల భవనం దృఢంగా, ఎల్లవేళలా చల్లగా ఉంటుంది.

భవనం గోడలను అతుక్కొని పెరిగే మొక్కలు కావటంతో ప్రాజెక్ట్‌లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది.

సీతాకోకచిలుకలు, రంగు రంగుల పక్షులతో ప్రాజెక్ట్ అంతా జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. క్రిమికీటకాలు, దోమలు ఇంట్లోకి రావు.

పచ్చదనాన్ని ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు సమస్యలు దరిచేరవు.

చుట్టూ గ్రీనరీ ఉండటంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

వర్టికల్ గార్డెన్‌‌సలో సువాసన వెదజల్లే మొక్కలుంటే ప్రాజెక్ట్ అంతా సువాసనమయమవుతుంది.

బాత్ రూమ్, వంట గదుల నుంచి వచ్చే వాసనలు, క్రిమి కీటకాలు వర్టికల్ గార్డెన్‌‌స పీల్చేస్తారుు. ఆరోగ్యకరమైన గాలిని, సువాసనలను వెదజల్లుతారుు. పెపైచ్చు ఎలివేషన్లకు ఎన్ని హంగులద్దినా అందంగా, ఆకర్షణీయంగా ఉండవు. అదే మొక్కలు పెంచితే ఆ లుక్కే వేరప్పా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement