హైదరాబాద్: ఒబామాకేర్ స్థానంలో మరో చట్టం వస్తే యూఎస్ మార్కెట్లో తమ వ్యాపారానికి ముప్పు వాటిల్లుతుందని ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఒబామాకేర్‌గా ప్రాచుర్యంలో ఉన్న పేషంట్ ప్రొటెక్షన్, అఫర్డబుల్ కేర్ యాక్ట్ (పీపీఏసీఏ) స్థానంలో కొత్త చట్టం అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్ తేవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 2017లో ఈమేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ యాక్ట్‌ను పాస్ చేశారు. ప్రస్తుతం ఈ చట్టం యూఎస్ సెనేట్ వద్ద పెండింగులో ఉంది. పీపీఏసీఏతోపాటు ఔషధాల ధర, ఆరోగ్య బీమాతో ముడిపడి ఉన్న చట్టాల్లో మార్పుతో కంపెనీ కార్యకలాపాలు, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూఎస్ సెక్యురిటీస్, ఎక్సే్చంజ్ కమిషన్‌కు రెడ్డీస్ తెలిపింది.
భారత్‌లోని తయారీ కేంద్రాలపై యూఎస్‌ఎఫ్‌డీఏతోపాటు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన నియంత్రణ సంస్థల తనిఖీలు ఇటీవలి కాలంలో పెరిగాయి. అత్యుత్తమ విధానాలు, నాణ్యత ప్రమాణాలు పాటించినా వార్నింగ్ లెటర్లు, ఇంపోర్ట్ బ్యాన్స్ నుంచి రక్షణకు హామీ లేదని వ్యాఖ్యానించింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్‌షిప్ (టీపీపీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి యూఎస్ వైదొలిగింది. స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో జరిగే మార్పులు, అదనపు కస్టమ్స్ డ్యూటీల విధింపు, అంతర్జాతీయ లావాదేవీల ఇబ్బందులతో కంపెనీ వ్యాపార పనితీరును ప్రభావితం చేస్తుందని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన జనరిక్ ఫార్మా కంపెనీలు ఎన్నో యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఇంపోర్ట్ అలర్ట్‌కు గురయ్యాయని గుర్తు చేసింది.
ఒబామాకేర్ మారితే వ్యాపారానికి ముప్పు:రెడ్డీస్
Published Tue, Jun 27 2017 1:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement