అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ | Dr Reddy's heart drug generic in US | Sakshi
Sakshi News home page

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్

Published Tue, Aug 30 2016 1:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ - Sakshi

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్

నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. హృద్రోగం కారణంగా చాతీలో అకస్మాత్తుగా వచ్చే నొప్పి నివారణకు, చికిత్సకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. నైట్రోస్టాట్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 0.3 మి.గ్రా., 0.4 మి.గ్రా., 0.6 మి.గ్రా. మోతాదుల్లో ఈ ట్యాబ్లెట్లు లభ్యమవుతాయి. 2016 మార్చితో ముగిసిన ఏడాదికి గాను అమెరికా మార్కెట్లో నైట్రోస్టాట్ అమ్మకాలు 108 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీరస్ షేరు సోమవారం స్వల్పంగా పెరిగి రూ. 3,048 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement