అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్
నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. హృద్రోగం కారణంగా చాతీలో అకస్మాత్తుగా వచ్చే నొప్పి నివారణకు, చికిత్సకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. నైట్రోస్టాట్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 0.3 మి.గ్రా., 0.4 మి.గ్రా., 0.6 మి.గ్రా. మోతాదుల్లో ఈ ట్యాబ్లెట్లు లభ్యమవుతాయి. 2016 మార్చితో ముగిసిన ఏడాదికి గాను అమెరికా మార్కెట్లో నైట్రోస్టాట్ అమ్మకాలు 108 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీరస్ షేరు సోమవారం స్వల్పంగా పెరిగి రూ. 3,048 వద్ద ముగిసింది.