నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Published Tue, Jun 27 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలుకావడంతో దేశీయంగా మిడ్ సెషన్ తరువాతనుంచి దాదాపుఅన్ని రంగాల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతోఆరంభ లాభాలను తగ్గించకున్న మార్కెట్ యూ టర్న్ తీసుకుంది. వరుసగా రెండో రోజూ కూడా నష్టపోయి ఒకనెల కనిష్టాన్ని నమోదు చేసింది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 300పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,500 పాయింట్ల దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 30,958 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు పతనమైన 9511వద్ద ముగిశాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన స్థాయికి దిగువన ముగియడం గమనార్హం.
ఒక్క ఎఫ్‌ఎంసీజీ మాత్రమే నిలదొక్కుకోగా అన్ని రంగాలూ పతనం దిశలోనే పయనించాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ రియల్టీ, ఆటో, ఐటీ, మెటల్ , క్యాపిటల్ గూడ్స్ రంగాలు క్షీణించాయి. పవర్, టెలికాం లాభపడ్డాయి. బీపీసీఎల్, బీవోబీ, జీ, యాక్సిస్, స్టేట్‌బ్యాంక్, ఏసీసీ, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్ తదితరాలు నష్టపోయాయి. ఐవోసీ, గెయిల్, ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, హీరోమోటో, టాటా స్టీల్, లుపిన్, వేదాంత లాభపడ్డాయి.
అటు డాలర్ మారకంలో రుపాయి 0.03పైసలు లాభపడి 64.49వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి రూ.90 లు పెరిగి పది గ్రా. 28,600 వద్ద ఉంది.
Advertisement
Advertisement