sensenx
-
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 11గంటల సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు నష్టంతో 58297.24 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 118 పాయింట్లు నష్ట పోయి 38604 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. ఎస్బీఐ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ గ్రూప్,కోల్ ఇండియా, ఎన్టీపీసీ,హిందాల్కో, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..హీరో మోటా కార్ప్, అథేర్ మోటార్స్,టాటా సీఓఎన్ ఎస్,లార్సెన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. -
10,100 పాయింట్ల చేరువలో నిఫ్టీ
గత రెండు రోజులుగా పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ మార్కెట్ గురువారం పరుగులు పెట్టింది. సెన్సెక్స్ ఏకంగా 32 వేల పాయింట్లపైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,100 పాయింట్ల చేరువలో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 348 పాయింట్లు లాభపడి 32,182 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు నెలల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు ఎగియడం ఇదే మొదటిసారి. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 10,096 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద స్టాక్ సూచీలు మూడు వారాల గరిష్ట స్థాయిలో ముగిశాయి. ఆగస్టు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు బాగుంటాయనే అంచనాలతో (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి) ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయి. పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలతో కన్సూమర్ షేర్లకు డిమాండ్ కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇక వివిధ ఫార్మా కంపెనీలకు నియంత్రణ సంస్థల నుంచి ఆమోదాలు లభించడంతో ఫార్మా షేర్లు కళకళలాడాయని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలు బాగా ఉండటంతో ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఎగిశాయి. ఆర్ఐఎల్ 4 శాతం అప్: నేడు (శుక్రవారం) క్యూ2 ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 4% వరకూ ఎగసి రూ.872.5 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన టీసీఎస్ షేర్ 1.9% పెరిగి రూ.2,548.55 వద్ద ముగిసింది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తమ దాద్రా ప్లాంట్‌కు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (ఈఐఆర్) పొందామని వెల్లడించడంతో సన్ ఫార్మా షేర్ 3% వరకూ పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, వేదాంత, హిందాల్కో, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అరబిందో ఫార్మా, టాటా స్టీల్ 1–6% రేంజ్లో పెరిగాయి. 1.46 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్‌సూచీల భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.46 లక్షల కోట్లు పెరిగి రూ.137.56 లక్షల కోట్లకు ఎగసింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గరిష్ట స్థాయిలవద్ద కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లు ఊగిసలాటల మధ్య నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి పుంజుకుని సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 32575వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి 10115 వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, ఫార్మా లాభపడగా అమ్మకాల ఒత్తిడి కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ నష్టపోయింది. ఒక దశలో ఇంట్రాడేలో నిఫ్టీ రికార్డ్ హైని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఎస్కార్ట్స్ 5 శాతం లాభపడగా, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా దాదాపు 5 శాతం జంప్‌చేయగా, ఐషర్, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, హిందాల్కో, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ అదానీ పోర్ట్స్, విప్రో, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి. లుపిన్, ఓన్జీసీ, రిలయన్స్, బీవోబీ, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, ఎస్బీఐ , యాక్సిస్, టీసీఎస్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. అటు డాలర్ మారకంలో రుపీ 0.12 పైసలు లాభపడి రూ.64.07వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. రూ.129 లు పతనమై రూ. 28, 428 వద్ద ఉంది. -
దలాల్‌స్ట్రీట్ రికార్డ్: దీపావళి సంబరాలు
ముంబై: దలాల్‌స్ట్రీట్ చరిత్ర సృష్టించింది. భారీలాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో నిఫ్టీ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ఎంతో ఆస్తకిగా ఎదురు చూస్తున్న 10వేల మార్క్ మైల్ స్టోన్ ని నిఫ్టీ తాకింది. ఆరంభంలో 10వేల మార్క్న్ టచ్ చేసి తద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రిక గరిష్టం 10వేల మార్క్‌ను తాకింది. అటు మరో ప్రధాన సూచీ సెన్సెక్స్ కూడా 32,374 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ సైతం 24,625 పాయింట్ల వద్ద కొత్త లాండ్మార్క్ను నమోదు చేసింది. దీంతో దలాల్ స్ట్రీట్‌లో సంబరాలు మిన్నంటాయి. సందడి వాతావరణం నెలకొంది. బ్రోకరేజ్ సంస్థలు, ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 32297 వద్ద, నిఫ్టీ పాయింట్లు 21 ఎగిసి వద్ద 9987 వద్ద కొనసాగుతోంది. స్టాక్‌మార్కెట్ ప్రీ ఓపెన్ లో 10వేల మార్క్‌ను తాకిన నిఫ్టీ ఆస్థాయిని తాకినా, స్వల్పంగా వెనక్కి తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ భారీగా పుంజుకోగా, ఐటీ స్వల్పంగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐటీసీ, ఇన్ఫ్రాటెల్, ఐబీహౌసింగ్, అంబుజా, హీరోమోటో, వేదాంతా, ఏసీసీ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్‌బ్యాంక్, పవర్‌గ్రిడ్ లాభాల్లోనూ, జీ, హెచ్‌సీఎల్ టెక్, లుపిన్, సిప్లా, విప్రో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా నష్టపోతున్నాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలుకావడంతో దేశీయంగా మిడ్ సెషన్ తరువాతనుంచి దాదాపుఅన్ని రంగాల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతోఆరంభ లాభాలను తగ్గించకున్న మార్కెట్ యూ టర్న్ తీసుకుంది. వరుసగా రెండో రోజూ కూడా నష్టపోయి ఒకనెల కనిష్టాన్ని నమోదు చేసింది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 300పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,500 పాయింట్ల దిగువకు చేరింది. చివరికి సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 30,958 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు పతనమైన 9511వద్ద ముగిశాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన స్థాయికి దిగువన ముగియడం గమనార్హం. ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రమే నిలదొక్కుకోగా అన్ని రంగాలూ పతనం దిశలోనే పయనించాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ రియల్టీ, ఆటో, ఐటీ, మెటల్ , క్యాపిటల్ గూడ్స్ రంగాలు క్షీణించాయి. పవర్, టెలికాం లాభపడ్డాయి. బీపీసీఎల్, బీవోబీ, జీ, యాక్సిస్, స్టేట్‌బ్యాంక్, ఏసీసీ, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్ తదితరాలు నష్టపోయాయి. ఐవోసీ, గెయిల్, ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హీరోమోటో, టాటా స్టీల్, లుపిన్, వేదాంత లాభపడ్డాయి. అటు డాలర్ మారకంలో రుపాయి 0.03పైసలు లాభపడి 64.49వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి రూ.90 లు పెరిగి పది గ్రా. 28,600 వద్ద ఉంది. -
ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు: రిలయన్స్ హవా
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 21 పాయింట్లుఎగిసి 31,176 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు క్షీణించి 9614 వద్ద ట్రేడ అవుతున్నాయి. రిలయన్స్ తన హవాను కొనసాగిస్తోంది. య భారతి ఎయిర్టెల్, వోక్హాడ్ లాభపడుతున్నాయి. ఫార్మ, ఐటీ స్పల్పంగా లాభపడుతుండగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ భారీగా నష్టపోతోంది. అలాగే గత రెండు సెషన్లుగా మైనస్‌లో ఉన్న మెటల్స్ గురువారంకూడా మైనస్‌లోనే ప్రారంభమైంది. హిందాల్కో, వేదాంత తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్, ఎస్‌బ్యాంక్ నష్టపోతున్నాయి. అటు డాలర్ మారకంలో రుపాయి 0.06 పైసల లాభంతో రూ. 64.28 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. పాజిటివ్‌గా ఉంది. రూ.76 పెరిగి రూ.29.020వద్ద కొనసాగుతోంది. -
లాభాల్లో మార్కెట్లు: ఐటీ , ఫార్మా డీలా
ముంబై: దేశీయ సోమవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభంమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పాజిటివ్ నోట్‌తో మొదలైన తర్వాత మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంతో 29, 480 వద్ద,నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 9153 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా రియల్టీ, ఇన్ఫ్రా, సిమెంట్, బ్యాంకింగ్ , ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు లాభాల్లో, ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. అయితే ఐటీ రంగానికి అమెరికా ట్రంప్ ఆరోపణల దెబ్బ భారీగా తాకింది. ముఖ్యంగా దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు సహా,ఇతర కంపెనీలు భారీగా నష్టాపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవల ఆల్‌టైం ను హైని తాకిన బ్యాంకు షేరు సోమవారం ఆరంభంలోనే 2 శాతానికిపైగా లాభపడింది. ఏసీసీ లాప్ విన్నర్‌గా ఉంది. ఎల్ అండ్ టి ఐబీ హౌసింగ్, గ్రాసిమ్, అంబుజా ఆర్ఐఎల్ లాభాల్లోను, జీ, లుపిన్, హెచ్‌యూఎల్, సిప్లా, యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికల నేపథ్యంలో దివీస్ నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. అటు అటు డాలర్ మారకంలో రూపాయి బలంగా మొదలైంది. 0.05 పైసల లాభంతో రూ.64.51 వద్ద ఉంది. గురువారం నాటి 64.61 ముగింపుతో పోలిస్తే పాజిటివ్‌గా ప్రారంభమైంది. అయితేపసిడి ధరలు మాత్రం బలహీనంగా ఉన్నాయి. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 26,964 వద్ద,నిఫ్టీ 17 లాభంతో 8290 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని సెక్టార్ లాభాలతో నిఫ్టీ 8300 స్తాయి దిశగా నడుస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఆటో, హెల్త్ కేర్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు 0.5 శాతం చొప్పున పెరిగాయి. పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, పెట్రోనెట్ ఎల్ఎన్జి, హావెల్స్ ఇండియా, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లాభాల్లో ఉన్నాయి. ఎస్ బ్యాంకు 2.4 శాతం లాభాలతో టాప్ విన్నర్ గా ట్రేడ్ అవుతోంది. ఒఎన్‌జిసి, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎసిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతి ఇన్ ఫ్రాటెల్ లుపిన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా షేర్లులాభాల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయితో పోలిస్తే బలహీన డాలర్ ట్రెండ్ ఐటీ షేర్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్ మారకపు రేటులో రూపాయి23 పైసలు లాభపడి రూ.67.82 వద్ద ఉంది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్ లో పదిగ్రా. 46 నష్టపోయి రూ.27,902 వద్ద ఉంది. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో
ముంబై: ఆద్యంతం ఓలటైల్ గా సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అలాగే భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి తో నిఫ్టీ నాలుగు నెలల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 97 పాయింట్లు క్షీణించి 27,430 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,485 వద్ద క్లోజ్ అయ్యాయి. కీలక మద్దతుస్థాయిలను కోల్పోతున్న నిఫ్టీ సుమారు నాలుగు నెలల తరువాత మొదటిసారి 8,500 దిగువన ముగిసింది. చివరికి ఆరంభ నష్టాలనుంచి మిడ్ సెషన్లో కోలుకున్నప్పటికీ చివరి అర్థగంటలో పెరిగిన అమ్మకాలతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అన్ని సెక్టార్లూ నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడింది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, మెటల్స్, ఐటీ రంగాలు నెగిటివ్ గా ముగిశాయి. గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బీపీసీఎల్, అరబిందో, టాటా స్టీల్, స్టేట్‌బ్యాంక్, బీవోబీ, ఎన్టీపీసీ నష్టపోగా, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్ గాఅహిందాల్కో 4 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, ఏసీసీ, హీరోమోటో, భెల్, గెయిల్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, హెచడీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి ఒక పైసా నష్టంతో 66.71వద్ద ఉంది. అయితే బంగారం ధరలుమాత్రం వెలవలబోయాయి. ఇటీవలి లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో 312 రూపాయల నష్టంతో పది గ్రా.పుత్తడి రూ. 30,354వద్ద ఉంది. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 28వేల 472 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 8627 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక సెక్టార్ సూచీల్లో హెల్త్‌కేర్ సూచీ 3.18శాతం, మెటల్ సూచీలు 0.90శాతం, రియాల్టీ 0.58శాతం, న ష్టపోతుండగా, ఐటి4.86శాతం, టెక్ సూచీలు 4.27శాతం, లాభపడుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గేయిన్స్ లిస్ట్‌లో ఇన్ఫీ 10.17శాతం, భారతీ ఎయిర్ టెల్ 4.69శాతం, హెచ్ సిఎల్ టెక్ 4.42శాతం, లాభపడుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో సన్ ఫార్మా 12.47శాతం, విఇడిఎల్ 3.49శాతం, టాటాస్టీల్ 2.45శాతం, హిందాల్కో 2.38శాతం నష్టపోతున్నాయి. ఇక ఇన్ఫోసిస్ ఆదాయం పెరగటంతో మార్కెట్లు జోరు మీదున్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు ఇంకా తగ్గుముఖంలోనే ఉన్నాయి. 10 గ్రా. ధర 25 వేల రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొంటోందని, ధరలు తగ్గినా వినియోగాదారుల కొనుగోళ్లు పెరగడంలేదని ఎనలిస్టులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి అయిదు పైసలు నష్టపోయి 63.71దగ్గర ఉంది.