దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గరిష్ట స్థాయిలవద్ద కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లు ఊగిసలాటల మధ్య నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి పుంజుకుని సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 32575వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి 10115 వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, ఫార్మా లాభపడగా అమ్మకాల ఒత్తిడి కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ నష్టపోయింది. ఒక దశలో ఇంట్రాడేలో నిఫ్టీ రికార్డ్ హైని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాల వెల్లువ కొనసాగింది.
ఎస్కార్ట్స్ 5 శాతం లాభపడగా, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా దాదాపు 5 శాతం జంప్‌చేయగా, ఐషర్, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, హిందాల్కో, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ అదానీ పోర్ట్స్, విప్రో, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి. లుపిన్, ఓన్‌జీసీ, రిలయన్స్, బీవోబీ, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ , యాక్సిస్, టీసీఎస్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
అటు డాలర్ మారకంలో రుపీ 0.12 పైసలు లాభపడి రూ.64.07వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పుత్తడి పది గ్రా. రూ.129 లు పతనమై రూ. 28, 428 వద్ద ఉంది.