ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 21 పాయింట్లుఎగిసి 31,176 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు క్షీణించి 9614 వద్ద ట్రేడ అవుతున్నాయి. రిలయన్స్ తన హవాను కొనసాగిస్తోంది. య భారతి ఎయిర్‌టెల్, వోక్‌హాడ్ లాభపడుతున్నాయి. ఫార్మ, ఐటీ స్పల్పంగా లాభపడుతుండగా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ భారీగా నష్టపోతోంది. అలాగే గత రెండు సెషన్లుగా మైనస్‌లో ఉన్న మెటల్స్ గురువారంకూడా మైనస్‌లోనే ప్రారంభమైంది. హిందాల్కో, వేదాంత తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్, ఎస్‌బ్యాంక్ నష్టపోతున్నాయి.
అటు డాలర్ మారకంలో రుపాయి 0.06 పైసల లాభంతో రూ. 64.28 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. పాజిటివ్‌గా ఉంది. రూ.76 పెరిగి రూ.29.020వద్ద కొనసాగుతోంది.