నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Published Fri, Jun 30 2017 9:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
ముంబై : దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ పెను సంస్కరణ జీఎస్టీ మరికొన్ని గంటల్లో అమలు కాబోతుంది. అయినప్పటికీ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. శుక్రవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 30,698 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 49.70 పాయింట్ల నష్టంలో 9,454గా ట్రేడింగ్ కొనసాగిస్తోంది. బ్యాంకు స్టాక్స్ బలహీనంగా ఉండటంతో మార్కెట్లు నష్టపోతున్నట్టు విశ్లేషకులు చెప్పారు.
కాగ, నేటి నుంచే జూలై నెల సిరీస్ కూడా ప్రారంభమైంది. ఆసియన్ పేయింట్స్, టెక్ మహింద్రా, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీఆర్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు ఒత్తిడిలో ఉన్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, సన్ ఫార్మాలు లాభాల్లో నడుస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 12 పైసలు బలహీనపడి 64.67గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా 43 రూపాయలు లాభపడి 28,610 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement