సాక్షి, ముంబై: లాభాలతో మొదలైన మార్కెట్లు తమహవాను కొనసాగిస్తున్నాయి. వరుగా సెషన్లుగా లాభపడుతున్న మార్కెట్లలో నిఫ్టీ మరోసారి 10వేల మార్క్‌ను అందుకుంది. ముఖ్యంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంకింగ్ కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మార్కెట్లు పటిష్ట లాభాలతో కదులుతున్నాయి.
ఆసియా మార్కెట్ల సానుకూతల నేపథ్యంలో లాభాలతో మొదలైన నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలోనే 10,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. అనంతరం స్వల్పంగా వెనుకబడింది..అలాగే సెన్సెక్స్ కూడా లాభాల్లో డబుల్‌సెంచరీకొట్టేసింది 222పాయింట్ల లాభంతో 31,909 వద్ద ఉంది.
అయితే ఇక్కడ సాంకేతికంగా కీలక రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం76 పాయింట్లు బలపడి 10 010 వద్ద ట్రేడవుతోంది. సుజ్లాన్, గెయిల్, పెట్రోనెట్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎల్‌అండ్‌టీ, ఎంఆర్‌పీఎఈల్, బజాజ్ ఫిన్, బాటా, సెంచురీ టెక్స్ భారీ లాభాలను సాధింస్తుండగా అయితే శ్రేఈ ఇన్‌ఫ్రా, ఐఆర్‌బీ, వోల్టాస్, ఒరాకిల్, మారికో, బయోకాన్, సన్ ఫార్మా, దివాన్ హౌసింగ్ నష్టపోతున్నాయి.
అటు డాలర్‌మాకరంలో రూపాయ బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అటు డాలర్‌మాకరంలో రుపీకూడా ఇదే ధోరణిలలో ఉంది. 0.005పైసల స్వల్ప లాభంతో 63.84 వద్ద ఉంది. బంగారం మాత్రం వెనకడుగువేసింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 244 పతనమై రూ. 30024వద్ద ఉంది.