నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ | Nissan Terrano 'Sport' special edition launched at Rs 12.22 lakh | Sakshi
Sakshi News home page

నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్

Published Tue, May 8 2018 5:28 PM | Last Updated on Wed, May 9 2018 8:02 AM

Nissan Terrano 'Sport' special edition launched at Rs 12.22 lakh - Sakshi

నిస్సాన్‌ టెర్రానో స్పోర్ట్‌ స్పెషల్‌ ఎడిషన్‌

సాక్షి, ముంబై: జపనీస్‌ కారు దిగ్గజం నిస్సాన్ విపణిలోకి సరికొత్త  ఫీచర్లతో టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో  కస్టమర్లను ఆకట్టుకునేలా  టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.   దీని ధరను రూ. 12.22 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది.
 
1.6లీటర్ పెట్రోల్ ,1.5 లీటర్ డీజల్ ఇంజన్‌ ఇలా రెండు వేరియంట్లలో వస్తున్న నిస్సాన్ టెర్రానో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ఎస్‍‌యూవీలో  ప్రధాన ఫీచర్ల  విషయానికి వస్తే టచ్ లెస్‌ చేంజ్ ఇండికేటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, పగటి పూట వెలిగే లైట్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ,  బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ రెండు రకాలుగా పవర్, టార్క్ ఉత్పత్తి చేస్తుంది.   84బిహెచ్‌పి పవర్-200ఎన్ఎమ్ టార్క్,  108బిహెచ్‌పి పవర్-243ఎన్ఎమ్ టార్క్. తక్కువ పవర్ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఎక్కువ పవర్ వేరియంట్లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ అనుసంధానంతో డ్రైవింగ్ అనుభవాన్ని పంచుకునేందుకు ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ ఫ్లాట్‌ఫామ్ నిస్సాన్ కనెక్ట్ సహకరిస్తుంది. ఇందులో సుమారుగా 50కి పైగా ఫీచర్లు ఉన్నాయి.  ముఖ్యంగా  7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ యథావిధిగా  అమర్చింది. అలాగే డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, క్రిమ్సన్-స్టిట్చ్‌డ్ సీట్ కవర్లు,  క్రిమ్సన్ సొబగులు  ఫ్లోర్ మ్యాట్స్‌ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement