సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్‌లోకి సంచలనంలా దూసుకు వచ్చిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనం నిర్ణయం తీసుకుందా? డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం తాజా ఆదేశాలకనుగుణంగా తన నెట్‌వర్క్‌లో పోర్న్‌వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ సైట్లకు యాక్సెస్ లభించడం లేదంటూ పలువురి జియో యూజర్ల అనుభవాన్ని బట్టిచూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఈ మేరకు ఒక యూజర్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో మరికొంత మంది యూజర్లు ప్రయత్నించారు. వారికీ ఇదే అనుభవం ఎదురైంది.
జియో నెట్‌వర్క్‌లో పోర్న్‌హబ్, ఎక్స్ వీడియోస్ సహా దాదాపు వందలాది వెబ్‌సైట్‌లు బ్లాక్ అయ్యాయి. దీంతో ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలను జియో పాటిస్తూ పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల ప్రకారం జియో వీడియో వినియోగం మందగించినప్పటికీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. అయితే మిగతా నెట్‌వర్క్‌లో ఇంకా ఈ ఆదేశాలు ఇంకా అమల్లోకి వచ్చినట్టు లేదు.
మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 27, 2018న ఆదేశించింది. జూలై 31,2015లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ఈ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ ఇందులో 30 వెబ్‌సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే సర్వీస్ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment