ఫ్రీడం 251 కంపెనీలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన మొబైల్ కంపెనీ రింగింగ్ బెల్స్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోయిడాలోని ఫీడ్రం 251 కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. సిబ్బందిని విచారించారు.
ఈ విషయం తెలిసి.. ఫోన్ బుక్ చేసుకున్న వందలాది మంది వినియోగాదారులు రింగింగ్ బెల్స్ కార్యాలయం ముందు గుమిగూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
కాగా నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఫోన్ ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించింది.. 'ఫ్రీడమ్ 251'గా పేర్కొన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ. 251 అంటూ ప్రకటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. కేంద్రం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింన సంగతి తెలిసిందే.