Cheapest smart phone
-
అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు భారత్‌లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లాంచ్ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోంది. రెండో సేల్కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ ట్విటర్లో షేర్ చేశారు. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్‌ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఓఎస్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ Today we had the second sale of #POCOM6Pro5G and it started at 12 noon and went Out of Stock in just 9 minutes. Thanks everyone for the tremendous response. #5GDisrupter #POCOM6Pro5G pic.twitter.com/k7f8QR7JR1 — Himanshu Tandon (@Himanshu_POCO) August 12, 2023 -
జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..!
జియో రాకతో భారత టెలికాం రంగంలో పెను సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. భారత్‌లో డిజిటల్ సాధికారితను సాధించేందుకు గాను అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ నెక్ట్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో తెర తీయనుంది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్..! భారత్‌లో 5G విప్లవం ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5జీ విస్తరణలో రిలయన్స్ జియో ముందంజలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగా 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే పనిలో రిలయన్స్ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధర ఎంతంటే..? 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో అధిపత్యాన్ని చెలాయిస్తోన్న రియల్మీ, రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. దీని కంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 10 వేలకు లభించనుంది. రిలయన్స్ జియోఫోన్ 5జీ స్పెసిఫికేషన్స్ (అంచనా) 6.5-అంగుళాల హెచ్డీ LCD డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ ప్రగతి ఓఎస్ బదులుగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4GB RAM+ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ 13-ఎంపీ+2-ఎంపీ రియర్ కెమెరా 8-ఎంపీ సెల్ఫీ కెమెరా మైక్రో SD కార్డ్ స్లాట్ N3, N5, N28, N40, N78 బ్యాండ్ సపోర్ట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5000mAh బ్యాటరీ USB-C సపోర్ట్ చదవండి: బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ ఇదేనేమో..! -
251 ఫోను పర్వాలేదట!
ఈ రోజుల్లో 251 రూపాయలు పెడితే ఏమొస్తుంది.. మహా అయితే మల్టీప్లెక్స్‌లలో ఓ సినిమా చూసి, ఇంటర్వెల్లో కొంచెం పాప్ కార్న్ తిని రావచ్చు అంతే. కానీ ఆ ధరలో స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారంటే.. అసలు అందులో ఏముందో, ఎలా పనిచేస్తోందో అనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదూ. ఇప్పటికే దాదాపు 5వేల ఫోన్లను డెలివరీ చేశారు కాబట్టి వాటి పనితీరు ఎలా ఉందన్న విశ్లేషణలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉంది. 4 అంగుళాల డిస్ప్లే, 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం అంతా 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగాపిక్సెల్ వరకు ఫ్రంట్ కెమెరాల యుగం నడుస్తుండటంతో.. కెమెరా విషయంలో కొంత అసంతృప్తి తప్పదు. కానీ, ఫోన్ మాత్రం బాగానే పనిచేస్తోంది. ఇందులో 1 జీబీ ర్యామ్ ఉంది, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజికి 8 జిబి స్పేస్ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్. వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫోనుకు సమీపంలో ఏవైనా విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉన్నాయేమో గమనించేందుకు ప్రాగ్జిమిటీ సెన్సర్ ఒకటి ఉంది. అలాగే కీప్యాడ్ లాక్ చేసి ఉన్నప్పుడు దాన్ని అన్‌లాక్ చేయాలంటే పవర్ బటన్ ఒత్తాల్సిన అవసరం లేదు.. స్క్రీన్ మీద వేలు ఆడిస్తే చాలు.. పాస్వర్డ్ అడుగుతుంది. వాట్సప్ కాలింగ్, మెసేజిలు, పాటలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటివన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఫోను వేడెక్కడం కూడా లేదు. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఉంటోంది. ఆటోమేటిగ్గా హిందీలోకి.. అయితే ఇందులో ఓ చమక్కు కూడా కనిపిస్తోంది. బ్యాటరీ లో అయినప్పుడు టెక్స్ట్ సెట్టింగులు ఆటోమేటిగ్గా హిందీలోకి మారిపోతున్నాయి. వాటిని మనం మళ్లీ వెతుక్కుని ఇంగ్లీషులోకి మార్చుకోవాల్సి వస్తోంది. బహుశా రాబోయే ఫోన్లలో దీన్ని సరిచేస్తారేమో చూడాలి. మిగిలిన అన్న విషయాలు చూస్తే మాత్రం 251 రూపాయల ధరలో ఈమాత్రం స్మార్ట్ ఫోనురావడం ఎక్కువేనంటున్నారు. -
ఫ్రీడం 251 కంపెనీలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన మొబైల్ కంపెనీ రింగింగ్ బెల్స్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోయిడాలోని ఫీడ్రం 251 కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. సిబ్బందిని విచారించారు. ఈ విషయం తెలిసి.. ఫోన్ బుక్ చేసుకున్న వందలాది మంది వినియోగాదారులు రింగింగ్ బెల్స్ కార్యాలయం ముందు గుమిగూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఫోన్ ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించింది.. 'ఫ్రీడమ్ 251'గా పేర్కొన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ. 251 అంటూ ప్రకటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. కేంద్రం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింన సంగతి తెలిసిందే.