ఆల్ టైం గరిష్టస్థాయికి నిఫ్టీ
ముంబై: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే మార్కెట్లు కదం తొక్కాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త శిఖర స్థాయిలను అందుకున్నాయి. సెన్సెక్స్ 21,484 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
6,415 పాయింట్లతో నిఫ్టీ ఆల్ టైం గరిష్టస్థాయిని చేరుకుంది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలతో నడుస్తోంది. సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా లాభాలతో దూసుకుపోతోంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అధిక స్థాయిలవద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టే అవకాశమున్నదని తెలిపారు.
అటు డాలర్ తో రూపాయి మారక విలువ కూడా నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. 36 పైసలు బలపడి 61.05గా రూపాయి మారక విలువ కొనసాగుతోంది.