![Paytm raising Rs 4,724 crore in funding round led by Alipay - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/14/pay.jpg.webp?itok=2O0Iaknm)
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్ మాతృసంస్థ, వన్97 కమ్యూనికేషన్స్ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్ పాంథర్(కేమ్యాన్) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ టోఫ్లర్ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment