Paytm & Alibaba
-
పేటీఎంలో ఆలీబాబా వాటాల విక్రయం
న్యూఢిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ దాదాపు 3 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 1,031 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ డేటా ప్రకారం ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ 1.92 కోట్ల షేర్లను (సుమారు 2.95 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 536.95 రేటుకి విక్రయించింది. దీనితో వన్97లో ఆలీబాబా మొత్తం వాటాలు 31.14 శాతం నుంచి 28.19 శాతానికి తగ్గాయి. గురువారం పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించి రూ. 543.50 వద్ద ముగిశాయి. పేటీఎం రుణ వృద్ధి 4 రెట్లు కాగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. -
ఐపీవోకు పేటీఎమ్,రూ.16,600 కోట్లు సమీకరణే లక్ష్యంగా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది.ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా జారీ చేయనుంది. మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు చైనీస్ గ్రూప్ అలీబాబా, తదితర సంస్థలు వాటాలను ఆఫర్ చేయనున్నాయి. నిధుల వినియోగం..: అలీబాబా కనీసం 5 శాతం వాటాను విక్రయించనుండగా.. సయిఫ్ 3 మారిషస్, సయిఫ్ పార్ట్నర్స్, బీహెచ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఐపీవో నిధులలో రూ. 4,300 కోట్లను బిజినెస్ పటిష్టత, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేటీఎమ్ పేర్కొంది. గతేడాది(2020–21) రూ. 3187 కోట్ల ఆదాయం సాధించింది. 2019–20లో రూ. 3,541 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే తగ్గింది. అయితే ఇదే కాలంలో నష్టాలు రూ. 2,943 కోట్ల నుంచి రూ. 1,704 కోట్లకు తగ్గినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలిపింది. చదవండి: నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
ఐపీఓ... వాటాదారుల అనుమతి బాటలో పేటీఎం
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న పేటీఎం తాజా ఈక్విటీ జారీకి వచ్చే నెలలో వాటాదారుల అనుమతిని కోరనుంది. తద్వారా రూ. 12,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ను పొందాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సర్వీసుల సంస్థ జులై 12న అసాధారణ సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈజీఎంలో భాగంగా విజయ్ శేఖర్‌కున్న ప్రమోటర్ గుర్తింపు రద్దు అంశాన్ని సైతం చేపట్టనుంది. శేఖర్ పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారు సంస్థలు సైతం ఐపీవోలో ఈక్విటీని విక్రయించేందుకు అనుమతిని కోరనున్నట్లు పేటీఎం తెలియజేసింది. పేటీఎంలో 29.71 శాతం వాటాతో యాంట్ గ్రూప్(అలీబాబా) అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ బాటలో సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ రూ. 19.63 శాతం, సైఫ్ పార్టనర్స్ 18.56 శాతం, విజయ్ శేఖర్ శర్మ 14.67% చొప్పున వాటాలు కలిగి ఉంది. -
పేటీఎంలో వాటా విక్రయించం
న్యూఢిల్లీ, సాక్షి: ఈపేమెంట్స్ సర్వీసుల సంస్థ పేటీఎంలో వాటాను విక్రయించబోమని చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ ట్విటర్ ద్వారా తాజాగా పేర్కొంది. పేటీఎంలో 30 శాతం వాటాను అమ్మివేస్తున్నట్లు వెలువడిన వార్తలు అసత్యాలని చైనీస్ ఈకామర్స్దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన యాంట్ గ్రూప్ స్పష్టం చేసింది. భారత్, చైనాల మధ్య రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ అయిన ఒన్97 కమ్యూనికేషన్స్‌లో గల వాటాను యాంట్ గ్రూప్ విక్రయించనున్నట్లు బుధవారం ఆంగ్ల మీడియాలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు వాటా విక్రయానికి సంబంధించి ప్రధాన వాటాదారులెవరితోనూ ఎలాంటి చర్చలూ చేపట్టలేదని, ఇలాంటి ప్రణాళికలేవీ లేవని, ఇవన్నీ ఆధారాలు లేని వార్తలని పేటీఎం ప్రతినిధులు సైతం ఖండించారు. చదవండి: (డిజిటల్ కరెన్సీవైపు జపాన్ చూపు) పోటీ ఎక్కువే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పేటీఎంకు ఇటీవల తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా వాల్‌మార్ట్ సంస్థ ఫోన్‌పే, గూగుల్ పే, అమజాన్ పే తదితరాలతో పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, వాలెట్స్, మర్చంట్ కామర్స్ తదితర విభాగాలలో తీవ్ర పోటీ ఉన్నట్లు వివరించారు. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను పొందడం ద్వారా బ్యాంకులు, కార్డులను జారీ చేసే పేమెంట్ గేట్‌వేలతోనూ పోటీ పడుతున్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్ మర్చంట్ విభాగంలో పైన్ ల్యాబ్స్‌ను ప్రత్యర్థి సంస్థగా తెలియజేశారు. కాగా.. 2019 నవంబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి పేటీఎం బిలయన్ డాలర్లు సమీకరించింది. దీని ఆధారంగా పేటీఎం విలువను 16 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. వెరసి పేటీఎంలో యాంట్ గ్రూప్‌నకున్న వాటా విలువను 5 బిలియన్ డాలర్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
పేటీఎం- గ్రోఫర్స్ డీల్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పుష్!
జియోమార్ట్ ద్వారా ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్లోకి డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించడంతో ఈకామర్స్ కంపెనీలలో కన్సాలిడేషన్‌కు మార్గమేర్పడవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కోవిడ్-19 సమస్యతో ఇటీవల ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, స్పెన్సర్స్ వంటి కంపెనీలకుతోడు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితరాలు సైతం ఈకామర్స్ ద్వారా గ్రోసరీస్ విక్రయాలను చేపడుతున్నాయి. కాగా.. ఆన్లైన్ రిటైలర్ పేటీఎంతోపాటు.. గ్రోఫర్స్‌లోనూ పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ బిజినెస్‌లో పోటీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేటీఎం, గ్రోఫర్స్ మధ్య విలీనం లేదా డీల్ కుదరితే ప్రయోజనకరంగా ఉంటుందని సాఫ్ట్‌బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య చర్చలకు తెరతీసినట్లు సంబంధివర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు ఇలా జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అటు పేటీఎం మాల్, ఇటు గ్రోఫర్స్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. వెరసి ఈ రెండు కంపెనీలలో తాజాగా ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలనూ అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ద్వారా పేటీఎం మాల్లో 20 శాతం వాటాను సాఫ్ట్‌బ్యాంక్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ ద్వారా గ్రోఫర్స్లో 40 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈకామర్స్ రిటైలర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న పేటీఎం, ఆన్లైన్ గ్రోసరీస్ విక్రేత అయిన గ్రోఫర్స్ మధ్య డీల్ కుదిరితే రెండు కంపెనీలకూ ప్రయోజనం చేకూరడంతోపాటు.. పెట్టుబడులు వృద్ధి చెందే వీలున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ ఆశిస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక డీల్‌కు తెరతీసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్లో అలీబాబాకు 35 శాతం వాటా ఉంది. సైఫ్ పార్టనర్స్, ఈబే, సీఈవో విజయ్ శంకర్ శర్మ సైతం వాటాలను కలిగి ఉన్నారు. కాగా.. మరోపక్క మిల్క్ డెలివరీ స్టార్టప్ మిల్క్ బాస్కట్‌లో పెట్టుబడికి పేటీఎం మాల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలను సైతం జత చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మిల్క్ బాస్కట్‌లో కలారీ కేపిటల్, మేఫీల్డ్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఊహాజనితాలు గ్రోఫర్స్‌తో డీల్ లేదా రెండు కంపెనీల మధ్య విలీనం వంటి అంచనాలను పేటీఎం మాల్ ప్రతినిధి ఒకరు తోసిపుచ్చారు. ఇక కంపెనీలో పేటీఎం మాల్ పెట్టుబడి వంటి అంశాలన్నీ ఊహాజనితాలని గ్రోఫర్స్ వ్యాఖ్యానించింది. ఇలాంటి అంచనాలపై తాము స్పందించబోమంటూ పేర్కొంది. -
పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్ మాతృసంస్థ, వన్97 కమ్యూనికేషన్స్ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్లైన్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన ఎస్వీఎఫ్ పాంథర్(కేమ్యాన్) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ టోఫ్లర్ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్ స్పందించలేదు. -
మరింత చౌకగా చైనా ఉత్పత్తులు..!
బెంగళూరు : చైనా ఉత్పత్తులు ఇక మరింత చౌకగా వినియోగాదారులకు లభ్యంకానున్నాయి. భారత ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ పేటైమ్, చౌకైన ధరలకు చైనా ఉత్పత్తులను భారత అమ్మకందారులకు అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో దోస్తి కట్టింది. దీంతో ఇప్పటికే చౌకగా లభ్యమయ్యే చైనా ఉత్పత్తులు మరింత చౌక కానున్నాయి. చౌకైన ధరలకే ఉత్పత్తులు అందించడంతో పాటు లాజిస్టిక్స్, చెల్లింపుల్లో సాయ పడనున్నట్టు పేటైమ్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టడానికి హోమ్, కిచెన్, మైక్రో ఇన్నోవేషన్, ఫ్యాషన్, మొబైల్ యాక్ససరీస్, వెస్ట్రన్ ప్యాషన్ కేటగిరీల్లో విశ్వసనీయమైన ట్రాక్ రికార్డున్న 25-30 భారత వ్యాపారులను గుర్తించామని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి కల్లా కనీసం 10 వేల మంది వ్యాపారులకు ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంది. 50 లక్షలకు పైగా ఉత్పత్తులను చౌకైన ధరలకే చైనా నుంచి భారత వ్యాపారులకు అందించేందుకు దోహదపడతామని పేటైమ్ వెల్లడించింది. లాజిస్టిక్స్, పేమెంట్స్ తర్వాత వాణిజ్యంలో ఇన్వెంటరీ మూడో స్థబం లాంటిదని పేటైమ్ అధికారి భూషణ్ పాటిల్ తెలిపారు. దీనికోసం గిడ్డంగి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. బిజినెస్ టూ కన్సూమర్ కామర్స్ బిజినెస్ లపై ఎక్కువ శ్రద్ధ వహిస్తామని, అమ్మకందారుల సోర్స్ కు సమర్థవంతంగా సాయం చేస్తూ, మార్జిన్లు బాగా రాబట్టడానికి దోహదంచేస్తామని కంపెనీ స్పష్టంచేసింది. డైరెక్ట్ కనెక్ట్ తో భారత చిన్నమధ్యతరహా కంపెనీల ఖర్చును మూడు రెట్టు తగ్గిస్తామని పాటిల్ చెప్పారు. చిన్నమధ్య తరహా కంపెనీలు చాలా డైరెక్ట్ గా సరుకు దిగుమతి చేసుకోవని, 2-3 దశల అనంతరం స్థానిక పంపిణీదారుల నుంచి సరుకును దిగుమతి చేసుకుంటాయని పేర్కొన్నారు. ఇన్ని దశలు లేకుండా డైరెక్టుగా ఉత్పత్తులను అమ్మకందారులకు అందిస్తామని చెప్పారు. ఖర్చును తగ్గించడానికి దిగుమతి హోస్ లతో టై-అప్ అవుతామని, తమ భాగస్వామ్యం సిటీబ్యాంకుతో విశ్వసనీయమైన చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు.