మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
* పెట్రోల్‌పై రూ. 2, డీజిల్‌పై 50పైసల తగ్గింపు
* అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ధరలు
న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 2, డీజిల్‌పై 50 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల రోజుల్లో ఇంధన ధరలు తగ్గటం ఇది మూడవ సారి.
స్థానిక పన్నుల్లో తగ్గుదలను కూడా కలుపుకుంటే వీటి ధరలు ప్రాంతాలవారీగా మరికొంత తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గటంతోపాటు, డాలర్-రూపాయి మారక విలువల్లో మార్పులు పెట్రో ధరల తగ్గుదలకు కారణమని ఐఓసీ పేర్కొంది.తాజా సవరణలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.66.29, డీజిల్ రూ. 48.45 కానుంది.