మెగా స్కాం: బ్యాంకు మరో కీలక ప్రకటన | PNB scam Banks says fraud amount could be Rs 1,323 cr more | Sakshi
Sakshi News home page

మెగా స్కాం: బ్యాంకు మరో కీలక ప్రకటన

Published Tue, Feb 27 2018 9:19 AM | Last Updated on Tue, Feb 27 2018 7:30 PM

PNB scam Banks says fraud amount could be Rs 1,323 cr more - Sakshi

సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణంగా  పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కాంలో మరో  కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ చెబుతున్నట్టుగా  రూ .11,400 కోట్ల రూపాయల మోసమేకాకుండా రూ. 1,300 కోట్ల (204 డాలర్లు) అక్రమ లావాదేవీలు జరిగాయని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుందని తెలిపింది.

సోమవారం రాత్రి బిఎస్ఇకి  అందించిన సమాచారం  ప్రకారం  బ్యాంకులో మరో అనధికార లావాదేవీలు రూ .1,300 కోట్లకు పైగా గుర్తించింది. దీంతో  కరెంట్ ఎక్స్ఛేంజ్ రేటులో  మొత్తం రు. 1,323 కోట్లుగా   ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పీఎన్‌బీ తెలిపింది.   డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు, వ్యాపార భాగస్వామి,  మెహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది.

మరోవైపు ఈ మెగా స్కాంలో కీలక నిందితులుగా ఉన్న నీరవ్‌ మోదీ,  చోక్సీ మాత్రమే కాదు. కంపెనీకి చెందిన కీలక ఎగ్జిక్యూటివ్‌లు  కూడా విదేశాలు చెక్కేసినట్టు తాజాగా  తెలిసింది.  అటు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, సీబీఐ  మరింత చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నీరవ్‌మోదీ విదేశీ ఆస్తులను సీజ్‌  చేసేందుకు  ఈడీ కసరత్తును ముమ్మరం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement