హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ కంపెనీ లివ్‌ఫాస్ట్ ఈ ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2018లో రూ.949 కోట్ల వ్యాపారం నమోదు చేసినట్టు కంపెనీ సీఈవో గుర్‌ప్రీత్ సింగ్ భాటియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చికల్లా 25,000 ఔట్‌లెట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పారు. ‘కొత్తగా ప్రవేశపెట్టిన మోడళ్లు 25 శాతం వేగంగా చార్జింగ్ అవడమేగాక 25 శాతం అదనపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. 18 రకాల మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మోడల్‌నుబట్టి 15 నుంచి 60 నెలల దాకా వారంటీ ఉంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment