న్యూఢిల్లీ: కార్పొరేట్ మోసాలను అరికట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ సంస్థల్లో సందేహాస్పద కార్యకలాపాలేమైనా కనిపించిన పక్షంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ప్రజావేగులను మరింతగా ప్రోత్సహించనుంది. అలాగే, కంపెనీల చట్టం కింద ఆయా సంస్థలు దాఖలు చేసే ఫైలింగ్స్‌లో.. కంపెనీ అధికారుల ఆధార్ సంఖ్య వివరాలను కూడా పొందుపర్చడం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పి.పి. చౌదరి ఈ విషయాలు తెలిపారు.
కంపెనీ ఫైలింగ్స్‌తో పాటు ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల సదరు అధికారులు/వ్యక్తుల ప్రామాణికతను అంచనా వేయడానికి ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. అక్రమంగా నిధులు మళ్లించేందుకు కొందరు ఏర్పాటు చేసే డొల్ల కంపెనీలకు చెక్ చెప్పేందుకు కూడా ఇది తోడ్పడగలదన్నారు. మనీ ల్యాండరింగ్‌పై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి లావాదేవీలు జరపని 2.26 లక్షల కంపెనీల పేర్లను ఇప్పటికే రికార్డుల నుంచి తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment