సాక్షి, ముంబై : దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కు సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్కు భారీ ఎత్తున కుచ్చు టోపీ పెట్టిన కంపెనీ మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకును కూడా ముంచేసింది. రూ.238 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఫోరెన్సిక్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రూ.238.30 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు, కంపెనీ, దాని డైరెక్టర్లు ఈ మేర ఫండ్స్ మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించింది. రుణదాతల బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులను సేకరించేందుకు భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ లిమిటెడ్ (బీపీఎస్‌ఎల్) బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని, అకౌంట్ బుక్స్‌ను తారుమారు చేసిందని పంజాబ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. దీంతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు గురువారం 6 శాతం పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment