నిర్మాణంలో నాణ్యతే లక్ష్యం | Quality target in construction | Sakshi
Sakshi News home page

నిర్మాణంలో నాణ్యతే లక్ష్యం

Published Fri, May 5 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

నిర్మాణంలో నాణ్యతే లక్ష్యం

నిర్మాణంలో నాణ్యతే లక్ష్యం

పోచారంలో ఎల్‌ఆర్‌ ఈస్ట్‌ ఓక్‌ లగ్జరీ ప్రాజెక్ట్‌
►  ఎకరన్నరలో 110 ఫ్లాట్లు; చ.అ.కు రూ.2,600
►  డిసెంబర్‌ నాటికి కొనుగోలుదారులకు అప్పగింత
► ఈ ఏడాది ఇక్కడే 4 ఎకరాల్లో మరో 2 ప్రాజెక్ట్‌లు
► బీబీనగర్‌లో రాక్‌ హైట్స్‌; రాంపల్లిలో గోల్డెన్‌ కౌంటీ వెంచర్లు కూడా..

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధరల్లో ఆధునిక వసతుల కల్పన, గడువులోగా ఫ్లాట్ల అప్పగింత.. ఇవే మా ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత అంటోంది సాయి సందీప్‌ ఇన్‌ఫ్రా. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిలో సుమారు 500 ఎకరాలను అభివృద్ధి చేసిన ఈ సంస్థ తొలిసారిగా పోచారంలో ఎల్‌ఆర్‌ ఈస్ట్‌ ఓక్‌ పేరిట లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల గురించి సంస్థ మేనేజింగ్‌ పార్టనర్‌ కే సందీప్‌ కుమార్‌ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఆయనింకా ఏమన్నారంటే..

► వరంగల్‌ హైవేలోని పోచారంలోని సింగపూర్‌ టౌన్‌షిప్‌ కంటే ముందు ఎకరన్నర విస్తీర్ణంలో ఎల్‌ఆర్‌ ఈస్ట్‌ ఓక్‌ను నిర్మిస్తున్నాం. ఈస్ట్‌ ఓక్‌ అనే పేరెందుకు పెట్టామంటే.. ‘ఈస్ట్‌’ ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతాన్ని సూచిస్తే.. ‘ఓక్‌’ చెట్టు దృఢత్వాన్ని సూచిస్తుంది. అంటే ఓక్‌ వృక్షంలాగే ఈస్ట్‌ ఓక్‌ నిర్మాణం కూడా దృఢత్వంగా ఉంటుందని అర్థం.
► సెల్లార్‌+5 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. రెండు బ్లాకుల్లో మొత్తం 110 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 2 బీహెచ్‌కే 70, 3 బీహెచ్‌కే 30 ఫ్లాట్లుంటాయి. ఫ్లాట్ల విస్తీర్ణాలు 1,205–1,660 చ.అ.మధ్య ఉన్నాయి. ధర చ.అ.కు రూ.2,600.
► 2,100 చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్, కామన్‌ మల్టీపర్పస్‌ హాల్, గేమ్స్‌ రూమ్, అంపీ థియేటర్, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటి వసతులుంటాయి. ఇప్పటికే 80 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే స్థానికంగా ఉన్న అభివృద్ధి, మార్కెట్‌ గిరాకీని అర్థం చేసుకోవచ్చు. ఏ, బీ బ్లాకులకు గాను ఏ బ్లాక్‌ నిర్మాణం పూర్తయింది. బీ బ్లాక్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి పోచారంలో 4 ఎకరాల్లో మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం. స్థల సమీకరణ కూడా పూర్తయింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలకు 70933 57777, 70933 34455 గానీ సంప్రదించవచ్చు.

ఈస్ట్‌ ఓక్‌లో ఎందుకు కొనాలంటే?: సాధారణంగా ఐటీ కంపెనీలు, ఉద్యోగులుండే ప్రాంతాల్లో ధరలు కాసింత ఎక్కువే ఉంటాయి. కానీ, మా ప్రాజెక్ట్‌లో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పూర్తయిన 80 శాతం అమ్మకాల్లో రిటైర్డ్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఇక పోచారంలోని అభివృద్ధి గురించి చెప్పాలంటే..  ఇన్ఫోసిస్, రహేజా మైండ్‌ స్పేస్, జెన్‌ప్యాక్ట్‌లకు 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉందీ ప్రాజెక్ట్‌. హైదరాబాద్‌– వరంగల్‌ హైవేకు 2 నిమిషాల్లో, ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌కు 3 నిమిషాల ప్రయాణ వ్యవధి.
► విద్యానికేతన్, రిక్వెల్‌ఫోర్డ్, కేంద్రీయ విద్యాలయం, శ్రీనిధి, శ్రీచైతన్య, ఎస్‌పీఆర్, సీవీఎస్‌ఆర్, నల్లమల్లారెడ్డి గ్రూప్‌ వంటి 15కి పైగా విద్యా సంస్థలున్నాయిసర్వీసు రోడ్లపై దృష్టిసారించాలినగరాన్ని ఇ తర జిల్లాలతో కలుపుతూ నగరం చుట్టూ 158 కి.మీ. మేర ఓఆర్‌ఆర్‌ను నిర్మించారు. కానీ, కొన్ని చోట్ల సర్వీస్‌ లైన్లను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ఆయా మార్గాల్లో అభివృద్ధి అక్కడికక్కడే ఆగిపోయింది. ఉదాహరణకు ఓఆర్‌ఆర్‌ నుంచి ఘట్‌కేసర్‌–కీసర సర్వీస్‌ రోడ్డు లేదు. దీంతో సర్వీసు రోడ్డుకు ఇవతల ఉన్న రాంపల్లిలో అభివృద్ధి ఆగిపోయింది.

ఓఆర్‌ఆర్‌ నుంచి రాంపల్లికి సర్వీస్‌ రోడ్డు ఉంటే 2 కి.మీ. దూరం. కానీ, రోడ్డు లేకపోవటంతో యానంపేట మీదుగా శ్రీనిధి కళాశాల పక్క నుంచి 4 కి.మీ. చుట్టూ తిరుగుతూ రాంపల్లికి చేరుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం డెవలపర్ల ఇబ్బందే కాదు స్థానికంగా ప్రజలూ రోజువారీ కార్యకలాపాల కోసం నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు నిర్మాణంపై దృష్టిసారించాలి.  
– సీఎండీ లింగారెడ్డి, సాయి సందీప్‌ డెవలపర్స్‌

20 ఎకరాల్లో రాక్‌ హైట్స్‌
► బీబీనగర్‌లోని సంజీవరావు నగర్‌లో 20 ఎకరాల్లో ఎల్‌ఆర్‌ రాక్‌ హైట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన వెంచర్‌. ఇందులో 60 గజాల నుంచి 450 గజాల చొప్పున ప్లాట్లను విక్రయిస్తున్నాం. ధర గజానికి రూ.5,500.
► విద్యుత్, నీటి సరఫరా, మురుగు నీటి పైప్‌లెన్ల ఏర్పాటుతో పాటూ రోడ్లు, పార్కు, వాటర్‌ ట్యాంక్, హార్వెస్టింగ్‌ పిట్స్‌ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్‌–వరంగల్‌ హైవేకు 2 కి.మీ. దూరంలో, ఏఐఐఎంఎస్‌ వర్సిటీకి 3 కి.మీ., హిందుస్తాన్‌ శానిటరీవేర్‌కు 4 కి.మీ., బాంబినో సంస్థకు 2 కి.మీ. ఉందీ వెంచర్‌.
► వచ్చే 6 నెలల్లో రాంపల్లిలో 20 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. ఎల్‌ఆర్‌ గోల్డెన్‌ కౌంటీ పేరిట రానున్న ఈ వెంచర్‌లో 250 గజాల చొప్పున ప్లాట్లుంటాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement