Sandeep Kumar Reddy
-
నిర్మాణంలో నాణ్యతే లక్ష్యం
పోచారంలో ఎల్ఆర్ ఈస్ట్ ఓక్ లగ్జరీ ప్రాజెక్ట్ ► ఎకరన్నరలో 110 ఫ్లాట్లు; చ.అ.కు రూ.2,600 ► డిసెంబర్ నాటికి కొనుగోలుదారులకు అప్పగింత ► ఈ ఏడాది ఇక్కడే 4 ఎకరాల్లో మరో 2 ప్రాజెక్ట్‌లు ► బీబీనగర్‌లో రాక్ హైట్స్; రాంపల్లిలో గోల్డెన్ కౌంటీ వెంచర్లు కూడా.. సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధరల్లో ఆధునిక వసతుల కల్పన, గడువులోగా ఫ్లాట్ల అప్పగింత.. ఇవే మా ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత అంటోంది సాయి సందీప్ ఇన్ఫ్రా. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిలో సుమారు 500 ఎకరాలను అభివృద్ధి చేసిన ఈ సంస్థ తొలిసారిగా పోచారంలో ఎల్ఆర్ ఈస్ట్ ఓక్ పేరిట లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల గురించి సంస్థ మేనేజింగ్ పార్టనర్ కే సందీప్ కుమార్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. ► వరంగల్ హైవేలోని పోచారంలోని సింగపూర్ టౌన్షిప్ కంటే ముందు ఎకరన్నర విస్తీర్ణంలో ఎల్ఆర్ ఈస్ట్ ఓక్‌ను నిర్మిస్తున్నాం. ఈస్ట్ ఓక్ అనే పేరెందుకు పెట్టామంటే.. ‘ఈస్ట్’ ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతాన్ని సూచిస్తే.. ‘ఓక్’ చెట్టు దృఢత్వాన్ని సూచిస్తుంది. అంటే ఓక్ వృక్షంలాగే ఈస్ట్ ఓక్ నిర్మాణం కూడా దృఢత్వంగా ఉంటుందని అర్థం. ► సెల్లార్+5 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. రెండు బ్లాకుల్లో మొత్తం 110 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 2 బీహెచ్‌కే 70, 3 బీహెచ్‌కే 30 ఫ్లాట్లుంటాయి. ఫ్లాట్ల విస్తీర్ణాలు 1,205–1,660 చ.అ.మధ్య ఉన్నాయి. ధర చ.అ.కు రూ.2,600. ► 2,100 చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కామన్ మల్టీపర్పస్ హాల్, గేమ్స్ రూమ్, అంపీ థియేటర్, ల్యాండ్ స్కేపింగ్ వంటి వసతులుంటాయి. ఇప్పటికే 80 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే స్థానికంగా ఉన్న అభివృద్ధి, మార్కెట్ గిరాకీని అర్థం చేసుకోవచ్చు. ఏ, బీ బ్లాకులకు గాను ఏ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. బీ బ్లాక్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి పోచారంలో 4 ఎకరాల్లో మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం. స్థల సమీకరణ కూడా పూర్తయింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలకు 70933 57777, 70933 34455 గానీ సంప్రదించవచ్చు. ఈస్ట్ ఓక్లో ఎందుకు కొనాలంటే?: సాధారణంగా ఐటీ కంపెనీలు, ఉద్యోగులుండే ప్రాంతాల్లో ధరలు కాసింత ఎక్కువే ఉంటాయి. కానీ, మా ప్రాజెక్ట్‌లో సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పూర్తయిన 80 శాతం అమ్మకాల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఇక పోచారంలోని అభివృద్ధి గురించి చెప్పాలంటే.. ఇన్ఫోసిస్, రహేజా మైండ్ స్పేస్, జెన్‌ప్యాక్ట్‌లకు 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉందీ ప్రాజెక్ట్. హైదరాబాద్– వరంగల్ హైవేకు 2 నిమిషాల్లో, ఘట్కేసర్ ఓఆర్ఆర్ జంక్షన్‌కు 3 నిమిషాల ప్రయాణ వ్యవధి. ► విద్యానికేతన్, రిక్వెల్ఫోర్డ్, కేంద్రీయ విద్యాలయం, శ్రీనిధి, శ్రీచైతన్య, ఎస్పీఆర్, సీవీఎస్ఆర్, నల్లమల్లారెడ్డి గ్రూప్ వంటి 15కి పైగా విద్యా సంస్థలున్నాయిసర్వీసు రోడ్లపై దృష్టిసారించాలినగరాన్ని ఇ తర జిల్లాలతో కలుపుతూ నగరం చుట్టూ 158 కి.మీ. మేర ఓఆర్ఆర్ను నిర్మించారు. కానీ, కొన్ని చోట్ల సర్వీస్ లైన్లను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ఆయా మార్గాల్లో అభివృద్ధి అక్కడికక్కడే ఆగిపోయింది. ఉదాహరణకు ఓఆర్ఆర్ నుంచి ఘట్కేసర్–కీసర సర్వీస్ రోడ్డు లేదు. దీంతో సర్వీసు రోడ్డుకు ఇవతల ఉన్న రాంపల్లిలో అభివృద్ధి ఆగిపోయింది. ఓఆర్ఆర్ నుంచి రాంపల్లికి సర్వీస్ రోడ్డు ఉంటే 2 కి.మీ. దూరం. కానీ, రోడ్డు లేకపోవటంతో యానంపేట మీదుగా శ్రీనిధి కళాశాల పక్క నుంచి 4 కి.మీ. చుట్టూ తిరుగుతూ రాంపల్లికి చేరుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం డెవలపర్ల ఇబ్బందే కాదు స్థానికంగా ప్రజలూ రోజువారీ కార్యకలాపాల కోసం నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నిర్మాణంపై దృష్టిసారించాలి. – సీఎండీ లింగారెడ్డి, సాయి సందీప్ డెవలపర్స్ 20 ఎకరాల్లో రాక్ హైట్స్ ► బీబీనగర్‌లోని సంజీవరావు నగర్లో 20 ఎకరాల్లో ఎల్ఆర్ రాక్ హైట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది హెచ్ఎండీఏ అనుమతి పొందిన వెంచర్. ఇందులో 60 గజాల నుంచి 450 గజాల చొప్పున ప్లాట్లను విక్రయిస్తున్నాం. ధర గజానికి రూ.5,500. ► విద్యుత్, నీటి సరఫరా, మురుగు నీటి పైప్లెన్ల ఏర్పాటుతో పాటూ రోడ్లు, పార్కు, వాటర్ ట్యాంక్, హార్వెస్టింగ్ పిట్స్ వంటి అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్–వరంగల్ హైవేకు 2 కి.మీ. దూరంలో, ఏఐఐఎంఎస్ వర్సిటీకి 3 కి.మీ., హిందుస్తాన్ శానిటరీవేర్‌కు 4 కి.మీ., బాంబినో సంస్థకు 2 కి.మీ. ఉందీ వెంచర్. ► వచ్చే 6 నెలల్లో రాంపల్లిలో 20 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. ఎల్ఆర్ గోల్డెన్ కౌంటీ పేరిట రానున్న ఈ వెంచర్లో 250 గజాల చొప్పున ప్లాట్లుంటాయి. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
ఐఎఫ్ఎస్ డెప్యూటీ సెక్రెటరీ సందీప్‌కుమార్‌రెడ్డి బసంత్‌నగర్: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఐఎఫ్ఎస్) డెప్యూటీ సెక్రటరీ బయ్యపు సందీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, బసంత్‌నగర్‌లోని ఆలీవర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేశోరాం గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. విద్య అనేది మనిషిలో విశ్వాసాన్ని పెంచుతుందని, ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని, అందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. వ్యక్తిగత నైపుణ్యం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైనాలో ప్రతి ఒక్కరికి వారివారి అభీష్టం మేరకు ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అలాంటి విధానాన్ని మన దేశంలో సైతం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన స్వగ్రామమైన రాణాపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తమ ఇంటిని గ్రామ అంగన్‌బాడీ కేంద్ర నిర్వహణకు ఇచ్చినట్లు వివరించారు. ఆయన వెంట బయ్యపు మనోహర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొండ్ర శంకర్, బాలసాని కుమార్, తిరుపతి ఉన్నారు. -
కొత్త పెట్టుబడులు పెట్టం
గాయత్రి ప్రాజెక్ట్ ్స ఎండీ సందీప్ కుమార్ రెడ్డి కొన్నాళ్ల పాటు ప్రస్తుత ప్రాజెక్టులపైనే దృష్టి రెండేళ్లలో రూ. 5,000 కోట్ల ఆదాయం సాధిస్తాం మరికొంత కాలం ఇన్ఫ్రాకు గడ్డుకాలమే మంచి ధర వస్తేనే బీవోటీ ప్రాజెక్టులను విక్రయిస్తాం రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో వ్యాపారం తగ్గింది హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో కొంత కాలం పాటు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటామని గాయత్రి గ్రూప్ స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణ, విద్యుత్, చక్కెర, ఆతిథ్యం వంటి పలు రంగాల్లో విస్తరించిన ఈ గ్రూపు... ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను లాభాల్లోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలియజేసింది. రహదారులు, రైల్వేలు సహా ఇతర నిర్మాణ రంగ ప్రాజెక్టులపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెబుతున్న ‘గాయత్రి ప్రాజెక్ట్స్’ ఎండీ టి.వి.సందీప్‌కుమార్ రెడ్డి... ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఇన్ఫ్రా రంగంలో ఏమైనా వృద్ధి కనిపిస్తోందా? రోజుకు 30 కి.మీ నిర్మాణ లక్ష్యం కుదురుతోందా? దేశీయ ఇన్ఫ్రా రంగానికి గడ్డు రోజులు పూర్తిగా పోయాయని చెప్పలేం. కానీ ఇప్పుడిప్పుడే కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఏ కంపెనీకి కూడా సొంత నిధులతో ప్రాజెక్టులను చేపట్టే శక్తి లేదు. ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఉంది. ఈ నిధుల్ని సమకూర్చడానికి మోదీ ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది. ఈపీసీ విధానంలో ఇప్పుడిప్పుడే రోడ్డు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తోంది. గడచిన ఆరు నెలల్లో మేం సుమారు రూ.4,000 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను దక్కించుకున్నాం. మున్ముందు కేంద్ర లక్ష్యానికి తగ్గట్టు రోజుకు 30 కి.మీ. నిర్మాణం, జాతీయ రహదారులను 95,000 కి.మీ. నుంచి 1.50 లక్షల కి.మీ. పెంచటం వంటివి సాధ్యం కావటం కష్టమేమీ కాదు. సగంలో ఆగిపోయిన బీవోటీ ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక సాయం ఇస్తానంటోంది. మీ సంస్థకూ ఇలాంటివేమైనా...? మేం 8 బీవోటీ ప్రాజెక్టులు చేపట్టాం. వీటిలో ఏడు పూర్తయ్యాయి. ఒకటి నిర్మాణంలో ఉంది. ఇవేవీ కేంద్రం ప్రకటించే ఆర్థిక సహాయం పరిధిలోకి రావు. కానీ ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటం వల్ల క్లెయిమ్స్ రావాల్సి ఉంది. ఎంత మొత్తం రావాలన్నది ఇంకా లెక్కించలేదు. రోడ్డు ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నారన్న వార్తలు నిజమేనా? రోడ్డు ప్రాజెక్టుల నుంచి వైదొలగడం లేదు. బీవోటీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు విక్రయించాలనుకుంటున్నాం. కాకపోతే అమ్మేవారు ఎక్కువ కావడంతో కొనేవారు చాలా చౌకగా అడుగుతున్నారు. ప్రస్తుతం మా బీవోటీ ప్రాజెక్టులేవీ నష్టాలను అందించడం లేదు. అలా అని లాభాలు కూడా ఇవ్వడం లేదు. అయితే తక్కువ రేటుకు అమ్మాల్సినంత అవసరం మాకు లేదు. ఈ లోగా వడ్డీరేట్లు దిగొస్తే ఈ ప్రాజెక్టులు లాభాలివ్వటం మొదలవుతుంది. ఈ ఏడాదిలో ఒక ప్రాజెక్టు విక్రయం కూడా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మంచి ధర వస్తేనే విక్రయిస్తాం. క్రమంగా దిగివస్తున్న వడ్డీరేట్లు, పెరుగుతున్న వాహనాల ట్రాఫిక్ దేశీయ ఇన్ఫ్రా రంగానికి శుభ సూచనలేగా? ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనం కంపెనీలకు ఇంకా అందలేదు. గతంలో 9 శాతం మీద తీసుకున్న రుణాలకు ఇంకా 11 శాతంపైనే వడ్డీ చెల్లిస్తున్నాం. గత రెండేళ్లతో పోలిస్తే ట్రాఫిక్ పెరిగినా... ఆ ప్రయోజనాన్ని ద్రవ్యోల్బణం దెబ్బతీస్తోంది. దీనిక్కారణం ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్దేశించే టోల్ ఫీజులే. టోకు ధరల సూచీ నెగటివ్ జోన్లోకి వెళ్ళడంతో టోల్ ఫీజులు తగ్గాయి. అలాగే మాకు చెందిన 3 టోల్ రోడ్డుల్లో ప్రధానమైన హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై రాష్ట్ర విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో ఇసుక రవాణా తగ్గి ఆ మేరకు ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులేమైనా చేపట్టే అవకాశం ఉందా? కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా వైదొలుగుతారా? కొత్తగా పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులేవీ కొన్నాళ్లపాటు తీసుకోం. ఏ రంగంలోనైనా కాంట్రాక్టులు మాత్రమే తీసుకుంటాం. ఇక 2600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టులో మెజార్టీ వాటా సింగపూర్‌కు చెందిన సెంబకార్ప్ తీసుకుంది. ఇప్పుడు ఈ యూనిట్ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏడాది మొత్తం ఇదే విధంగా పనిచేస్తే ఈ ప్రాజెక్టు నుంచే రూ.8,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఆ మేరకు మాకు రూ.3,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇంధన సరఫరా, లాభదాయకమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరితే ఇక్కడే విస్తరించడానికి చాలా స్థలం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి విస్తరణ, కొత్త ప్రాజెక్టులు చేపట్టే ఆలోచన లేదు. వచ్చే రెండేళ్లలో గాయత్రి గ్రూపు వ్యాపార లక్ష్యాలేంటి? అప్పులు తగ్గించుకుని వాటాదారులకు లాభాలందించడమే మా లక్ష్యం. ఇపుడు గాయత్రీ ప్రాజెక్ట్స్‌కి రూ.1,600 కోట్ల రుణాలున్నాయి. ఇందులో ప్రధాన వాటా రోడ్డు, విద్యుత్ రంగానిదే. ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టు లాభాల్లోకి రావడంతో అప్పులు తగ్గించుకునే వెసులుబాటు కలుగుతోంది. చేతిలో రూ. 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఈ ఏడాది రూ.2,500 కోట్లు ఆర్డర్లు పూర్తి చేయాలని లక్ష్యించాం. ఈ ఏడాది గాయత్రీ ప్రాజెక్ట్స్ ఆదాయం రూ.2,000 కోట్ల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే రెండేళ్లు 30 శాతం వార్షిక వృద్ధి నమోదు కావచ్చు. ఇక గ్రూపు మొత్తం ఆదాయం సుమారుగా రూ.3,000 కోట్లు. రెండేళ్లలో ఇది రూ.5,000 కోట్ల మార్కును అధిగమిస్తుంది. రైల్వే ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతున్నాం. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు బిడ్లు వేశాం.