రాంకీ ఇన్ఫ్రాకు రూ. 613 కోట్ల ఆర్డరు | Ramky Infrastructure sees Rs6,000 cr orders till March | Sakshi
Sakshi News home page

రాంకీ ఇన్ఫ్రాకు రూ. 613 కోట్ల ఆర్డరు

Published Wed, Jun 8 2016 1:20 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

రాంకీ ఇన్ఫ్రాకు రూ. 613 కోట్ల ఆర్డరు - Sakshi

రాంకీ ఇన్ఫ్రాకు రూ. 613 కోట్ల ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాజాగా సుమారు రూ. 613 కోట్ల ఆర్డరును దక్కించుకుంది. ప్రాజెక్టు కింద పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో రహదారుల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌హెచ్-200పై వివిధ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం-పింక్ ప్లాజా మధ్య రహదారి సుందరీకరణ తదితర పనులు తాము చేపట్టాల్సి ఉంటుందని రాంకీ తెలియజేసింది. భారీ ఆర్డరు వార్తలతో రాంకీ ఇన్‌ఫ్రా షేరు మంగళవారం బీఎస్‌ఈలో సుమారు 3 శాతం పెరిగి రూ. 67.85 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement