హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన అనుబంధ కంపెనీ అయిన నామ్ ఎక్స్‌ప్రెస్‌వేను సింగపూర్‌కు చెందిన క్యూబ్ హైవేస్‌కు విక్రయించింది. నార్కట్‌పల్లి– అద్దంకి– మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేలో (నామ్) నూరు శాతం వాటా అమ్మకానికై క్యూబ్ హైవేస్‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు శుక్రవారం బీఎస్‌ఈకి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ డీల్ ద్వారా రామ్‌కీ రూ.140 కోట్లు పొందడంతోపాటు నామ్ ఎక్స్‌ప్రెస్‌వే పేరున ఉన్న రుణాలన్నీ క్యూబ్‌కు బదిలీ అవుతాయి.
ఈ మొత్తాన్ని కంపెనీకి ఉన్న రుణం తగ్గించుకోవడానికి వినియోగించనున్నట్టు రామ్‌కీ తెలిపింది. నామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో వాటాల విక్రయంతో రామ్‌కీ ఇన్‌ఫ్రా రుణం రూ.1,529 కోట్ల మేర తగ్గుతుందని వెల్లడించింది. యాజమాన్య మార్పు విషయమై రుణదాతలు, సంస్థల నుంచి అనుమతులు పొందినట్టు తెలిపింది. శుక్రవారం బీఎస్‌ఈలో రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర ఒకానొక దశలో రూ.207.60 వరకు వెళ్లింది. చివరకు 3.29% పెరిగి రూ.204.25 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment