హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌కు సంబంధించి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్‌తో (ఐటీఎన్‌ఎల్) ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్‌ఏఎమ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఐటీఎన్‌ఎల్‌కు ఉన్న 50% వాటాను రామ్‌కీ కొనుగోలు చేసింది. రూ.10 ముఖ విలువ ఉన్న 11,67,50,000 వాటాలను దక్కించుకుంది. దీంతో ఎన్‌ఏఎమ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా రామ్‌కీ అనుబంధ కంపెనీ అయింది.
అలాగే జోరాబట్ షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వేలో (జేఎస్‌ఈఎల్) రామ్‌కీ తనకున్న 50 శాతం వాటాను ఐటీఎన్‌ఎల్‌కు విక్రయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 4,20,00,000 వాటాలను ఐటీఎన్‌ఎల్ దక్కించుకుంది. జోరాబట్ షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇక ఐటీఎన్‌ఎల్ పూర్తి అనుబంధ కంపెనీ. తాజా డీల్స్‌తో ఐటీఎన్‌ఎల్‌కు నికరంగా రూ.43.20 కోట్లను చెల్లించినట్టు రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బీఎస్‌ఈకి శుక్రవారం వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో రామ్‌కీ ఇన్‌ఫ్రా షేరు 5 శాతం పెరిగి రూ.176.45 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment