
మౌలిక రంగ సంస్థ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.939.41 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎన్‌హెచ్‌ఏఐ నుంచి చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా జమ్ము–శ్రీనగర్ హైవేలో గలందర్ నుంచి సంబల్ రోడ్ మధ్య ప్రతిపాదిత శ్రీనగర్ రింగ్ రోడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ విధానంలో 42.10 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తారు.
36 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఈ నిర్మాణం పూర్తయితే శ్రీనగర్ సిటీతోపాటు నగరం చుట్టుపక్కల ట్రాఫిక్ సులభంగా వెళ్లేందుకు వీలవుతుంది. హెవీ మెషినరీని సరిహద్దులో కీలక ప్రాంతాలైన బారాముల్లా, యూరీ, కుప్వారా, బందీపురకు అడ్డంకులు లేకుండా చేరవేయవచ్చు. ఐదు జిల్లాల్లో విస్తరించిన ఈ రోడ్డు 52 గ్రామాలను అనుసంధానిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment