
న్యూఢిల్లీ: సులభ వ్యాపార విధానాల ప్రాతిపదిక తరహాలోనే మీడియా, వినోదం సూచీ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో మెరుగైన ర్యాంకింగ్ కోసం రాష్ట్రాలు పోటీపడతాయి కాబట్టి మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా వృద్ధి చెందగలదని ఆయన పేర్కొన్నారు. ‘యూరప్‌లోని 24 దేశాలకన్నా కూడా భారత్ చాలా పెద్ద దేశం.
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మన రాష్ట్రాల్లో విధానాలు మరింత సులభతరంగా ఉండటంపై దృష్టి పెట్టాలి. ఈ రెండింటితో పాటు గేమింగ్, డిజిటైజేషన్ మొదలైన అంశాల సూచీల ప్రాతిపదికగా ర్యాంకింగ్ ఇవ్వాలి‘ అని సీఐఐ బిగ్ పిక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ పేర్కొన్నారు.