రస్ అల్ ఖైమాలో మోల్డ్-టెక్ ప్లాంట్ ప్రారంభం | Ras Al khaimah Free Trade new plant Mold-Tek Packaging | Sakshi
Sakshi News home page

రస్ అల్ ఖైమాలో మోల్డ్-టెక్ ప్లాంట్ ప్రారంభం

Published Tue, Aug 9 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

Ras Al khaimah Free Trade new plant Mold-Tek Packaging

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రస్ అల్ ఖైమా ఫ్రీ ట్రేడ్ జోన్‌లో తమ కొత్త ప్లాంటును ఆవిష్కరించినట్లు మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ వెల్లడించింది. ఈ నెలలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాగలవని పేర్కొంది. 1,192 చ.మీ. మేర విస్తరించిన ప్లాంటు సామర్థ్యం ప్రస్తుతం 2,500-3,000 టన్నులుగా ఉంది. ప్లాంటు కార్యకలాపాల సానుకూల పనితీరు ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు త్రైమాసికాల్లో మరింత వృద్ధి కనిపించగలదని కంపెనీ పేర్కొంది. మరోవైపు, ప్యాకేజింగ్ రంగానికి విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను సంస్థ సీఎండీ లక్ష్మణ రావుకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ తయారీ సంస్థల అసోసియేషన్(సీపీఎంఏ) .. ఎలీట్ ప్లస్ బిజినెస్ సర్వీసెస్ గ్రూప్ ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ అవార్డును ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement