‘నికి’లో రతన్ టాటా పెట్టుబడులు.. | Ratan Tata, Unilazer invest in niki.ai - an artificial intelligence based chatbot | Sakshi
Sakshi News home page

‘నికి’లో రతన్ టాటా పెట్టుబడులు..

Published Fri, May 20 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

‘నికి’లో రతన్ టాటా పెట్టుబడులు..

‘నికి’లో రతన్ టాటా పెట్టుబడులు..

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్టార్టప్‌ల పెట్టుబడుల జోరు కొనసాగుతుంది.

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్టార్టప్‌ల పెట్టుబడుల జోరు కొనసాగుతుంది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్‌బోట్, నికిడాట్‌ఏఐలో ఆయన తాజాగా పెట్టుబడులు పెట్టారు. రతన్ టాటా నుంచే కాకుండా ఇప్పటికే ఆ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన రోనీ స్క్రూవాలా ఆధ్వర్యంలోని యూనిలేజర్ కూడా నికిడాట్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. అయితే  పెట్టుబడి వివరాలను నికిడాట్‌ఏఐ వెల్లడించలేదు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన సచిన్ జై శ్వాల్, కేశవ్ ప్రవాసి, నితిన్ బాబెల్, శిశిర్ మోడిలు నికిడాట్‌ఏఐను 2015లో ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ కంపెనీలో 21 మంది ఉద్యోగులు ఉన్నారు. సింపుల్ చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారులతో సంభాషించి వారి ఆర్డర్లను క్షణాల్లోనే భాగస్వామ్య సంస్థకు చేరవేసే లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఈ సంస్ధ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ బిల్లు చెల్లింపులు, క్యాబ్ బుకింగ్, రీ చార్జ్, ఆహార పదార్ధాలు, గృహ సంబంధిత సేవలకు సంబంధించిన ఆర్డర్లను తీసుకోవడం చేస్తోంది. రతన్ టాటా, యునిలేజర్‌ల నుంచి పెట్టుబడులు అందుకోవడం గర్వకారణమని నికిడాట్‌ఏఐ సీఈఓ సచిన్ జైస్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement