
ఎంఅర్జెన్సీ స్టార్టప్ లో రతన్ టాటా పెట్టుబడి
స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. తాజాగా ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన అత్యవసర వైద్య సేవలందించే స్టార్టప్..
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. తాజాగా ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన అత్యవసర వైద్య సేవలందించే స్టార్టప్.. ఎంఅర్జెన్సీ ఇన్‌కార్పొలో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడుల వివరాలు వెల్లడి కాలేదు. రతన్ టాటా పెట్టుబడుల వల్ల ప్రతిభ గల ఉద్యోగులు తమ కంపెనీకి వస్తారని ఎంఅర్జెన్సీ ఇన్‌కార్పొ వ్యవస్థాపకులు షఫి మాధుర్ చెప్పారు. భారత వెలుపల మరిన్ని పెద్ద భాగస్వామ్యాలకు రతన్ టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ తోడ్పడుతాయని పేర్కొన్నారు. క్రిస్ గోపాలకృష్ణన్, ఎస్.డి. శిబులాల్‌ల నేతృత్వంలోని యాక్సిలర్ వెంచర్స్ కూడా ఈ స్టార్టప్‌లో ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 9 నిమిషాల్లోగా స్పందిస్తామని మాధుర్ పేర్కొన్నారు. కాగా రతన్ టాటా గత రెండేళ్లలో 25కు పైగా స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు.