న్యూఢిల్లీ : ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ కే సెకండ్ ఇన్నింగ్స్ ఖాయమనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు, ప్రభుత్వం పరిణతి సంబంధంతో కలిసి పనిచేస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడం ప్రాముఖ్యత చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలతో డైరెక్ట్ గా కాకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా రఘురామ్ రాజన్ కే రెండోసారి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని సూచనలు వస్తున్నాయి. మహిళల ప్రెస్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్ లో అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా..? అనే ప్రశ్న తలెత్తగా, ఇది మీడియా ద్వారా చర్చించాల్సి విషయం కాదని చమత్కరించారు.
ఈ సెప్టెంబర్ తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. రెండోసారి కూడా తాను ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగడానికి సిద్ధమన్న సంకేతాలను రాజన్ కూడా ఇచ్చారు. అయితే గవర్నర్ గా రాజన్ కాలంలో నిరుద్యోగం పెరిగిందని, పారిశ్రామికోత్పత్తి క్షీణించిందని, ఆయన పదవీ కాలాన్ని పొడిగించరాదని బీజేపీ నేత సుబ్రహ్మణ్యంస్వామి, ఇతర బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ బీఐ గవర్నర్ గా అతను తగిన వ్యక్తి కాదని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి వడ్డీరేట్లు పెంచి దేశానికి నష్టం వాటిల్లేలా చేశాడని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్‌లీవ్’ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
రెండోసారి ఆర్ బీఐ బాధ్యత రాజన్ కేనా ...?
Published Mon, May 16 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM
Advertisement