
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా బ్యాంక్ ఆఫ్ చైనాకు భారత్‌లో కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి అనుమతినిచ్చింది. చైనాలో గత నెల జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ కలుసుకున్నప్పుడు ఇరువురి మధ్య బ్యాంక్ కార్యకలాపాలకు అంశం చర్చకు వచ్చింది.
భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్‌ల ఏర్పాటుకు మోదీ అంగీకారం తెలిపారు. భారత్‌లో తొలి బ్రాంచ్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ లైసెన్స్ జారీచేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా రక్షణ మంత్రి త్వరలో భారత్‌లో పర్యటించనున్నారని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment